Gujarat | జలాశయాలను తలపించిన విమానాశ్రయాలు
Gujarat భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం విధాత: గుజరాత్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన పట్టణాలు కూడా వరద పోటుకు గురవుతున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో విమానాశ్రయ ప్రాంగణం జలాశయాన్ని తలపిస్తుంది. టెర్మినల్ ఏరియాలతోపాటు రన్‌వే పైకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు సమయానికి తమ ఫ్లైట్‌ను చేరుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మోకాళ్ల లోతు నీళ్లలో […]
Gujarat
- భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం
విధాత: గుజరాత్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన పట్టణాలు కూడా వరద పోటుకు గురవుతున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో విమానాశ్రయ ప్రాంగణం జలాశయాన్ని తలపిస్తుంది. టెర్మినల్ ఏరియాలతోపాటు రన్‌వే పైకి కూడా వరద నీరు వచ్చి చేరింది.

దీంతో ప్రయాణికులు సమయానికి తమ ఫ్లైట్‌ను చేరుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మోకాళ్ల లోతు నీళ్లలో ప్రయాణికులు అటూ ఇటూ నడవాల్సి వస్తున్నది. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరద పరిస్థితిపై నెటిజన్‌లు రకరకాల కామెంట్లతో సెటైర్లు వేస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్టులో విమానాలు ఎగరడం కష్టమని, పడవలు సులభంగా పరుగులు తీస్తాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.

గత 28 ఏళ్లలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టును వరదలు ముంచెత్తడం ఇదే తొలిసారని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే ఎయిర్‌పోర్టులోంచి వరద నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గుజరాత్ – జునాగఢ్ జిల్లాలో కుసురుస్తున్న భారీ వర్షాల వరదలతో కార్లు, పశువులు కొట్టుకుపోగా ఓ వ్యక్తి నీటిలో కొట్టుకపోతున్న తన కారు కోసం ప్రయత్నించి తను వరదల్లో కొట్టుకపోయాడు.
భారీ వరదలలో నవ్‌సారి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు కాగితపు పడవల మాదిరిగా కొట్టుకపోయిన తీరు రాష్ట్రంలో వరదల ఉదృతికి నిదర్శనం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram