Gangster Lawrence Bishnoi | ఢిల్లీ జైలుకు గ్యాంగ్‌స్ట‌ర్ బిష్ణోయ్‌

అహ్మ‌దాబాద్ స‌బ‌ర్మ‌తీ జైలు నుంచి మండోలి జైలుకు వాయుమార్గాన‌ త‌ర‌లింపు భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేసిన పోలీసులు విధాత‌: గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్‌ (Gangster Lawrence Bishnoi) ను అహ్మ‌దాబాద్‌లోని స‌బ‌ర్మ‌తి సెంట్ర‌ల్ జైలు నుంచి ఢిల్లీలోని మండోలి జైలుకు గుజ‌రాత్ పోలీసులు గురువారం త‌ర‌లించారు. భారీ బందోబస్తు మ‌ధ్య అత‌డిని ఢిల్లీ విమానాశ్ర‌యానికి గురువారం మ‌ధ్యాహ్నం తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దేశ స‌రిహ‌ద్దులు దాట‌డం, డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ కేసుల్లో గుజ‌రాత్ […]

Gangster Lawrence Bishnoi | ఢిల్లీ జైలుకు గ్యాంగ్‌స్ట‌ర్ బిష్ణోయ్‌
  • అహ్మ‌దాబాద్ స‌బ‌ర్మ‌తీ జైలు నుంచి
  • మండోలి జైలుకు వాయుమార్గాన‌ త‌ర‌లింపు
  • భారీ బందోబ‌స్తు ఏర్పాటుచేసిన పోలీసులు

విధాత‌: గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్‌ (Gangster Lawrence Bishnoi) ను అహ్మ‌దాబాద్‌లోని స‌బ‌ర్మ‌తి సెంట్ర‌ల్ జైలు నుంచి ఢిల్లీలోని మండోలి జైలుకు గుజ‌రాత్ పోలీసులు గురువారం త‌ర‌లించారు. భారీ బందోబస్తు మ‌ధ్య అత‌డిని ఢిల్లీ విమానాశ్ర‌యానికి గురువారం మ‌ధ్యాహ్నం తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

దేశ స‌రిహ‌ద్దులు దాట‌డం, డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ కేసుల్లో గుజ‌రాత్ యాంటి టెర్ర‌రిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌) పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్‌లో బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. క‌చ్‌లోని కోర్టులో గ్యాంగ్‌స్ట‌ర్‌ను ఏటీఎస్ పోలీసులు హాజ‌రుప‌ర్చ‌గా మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. కాగా, కాంగ్రెస్ లీడ‌ర్‌ సిద్ధు మూసేవాలా హ‌త్య కేసులో గ‌త ఏడాది బిష్ణోయ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఢిల్లీకి త‌ర‌లింపు

భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా గ్యాంగ్‌స్ట‌ర్ బిష్ణోయ్‌ను ఢిల్లీలోని మండోలి జైలుకు త‌ర‌లించిన‌ట్టు పోలీస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. హై సెక్యూరిటీ వార్డులోని 15వ నంబ‌ర్ సెల్‌ను అత‌డికి కేటాయించారు. మే 2న జైలు ప్రాంగ‌ణంలోనే టిల్లు తాజ్‌పూరియా హ‌త్య జ‌రింది. ఈ నేప‌థ్యంలో తీహార్ జైలులో గ్యాంగ్‌వార్ జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో ఈ త‌ర‌లింపు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.

రోహిణి కోర్టు కాల్పుల ఘ‌ట‌న‌లో నిందితుడు

గ్యాంగ్‌స్ట‌ర్ బిష్ణోయ్‌కి తాజ్‌పూరియా అత్యంత ద‌గ్గ‌రి స‌న్నిహితుడు. మే 2న తాజ్‌పూరియాను ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాలు దారుణంగా చంపేశాయి. త‌ల‌, ఛాతి, వీపు మీద ఇత‌ర చోట్ల‌ 92 సార్లు పొవ‌డంతో అత‌డు చ‌నిపోయాడు. 20121లో జ‌రిగిన రోహిణి కోర్టు కాల్పుల ఘ‌ట‌న‌లో తాజ్‌పూరియా నిందితుడు.