Gurgaon | యాప్ ఓపెన్ కావ‌డంలేద‌ని అస‌హ‌నం.. కుమారుడికి తండ్రి క‌త్తిపోటు

Gurgaon | గురుగ్రాంలో దిగ్భ్రాంతిక‌ర ఘ‌టన చోటు చేసుకుంది. యాప్ త్వ‌ర‌గా ఓపెన్ కావ‌డం లేద‌ని ఆవేశంలో ఉన్న ఓ వ్య‌క్తి త‌న 23 ఏళ్ల కుమారుడిని క‌త్తితో పొడిచాడు. పోలీసులు ఆదివారం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 64 ఏళ్ల అశోక్ సింగ్ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో సీనియ‌ర్ ఇంజినీర్‌గా ప‌నిచేసి రిటైర్ అయ్యారు. భార్య‌, త‌న 23 ఏళ్ల కుమారుడు ఆదిత్య సింగ్‌ల‌తో క‌లిసి ఉంటున్న అశోక్.. ఇటీవ‌లే ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దానికి […]

  • By: krs    latest    Jun 18, 2023 7:46 AM IST
Gurgaon | యాప్ ఓపెన్ కావ‌డంలేద‌ని అస‌హ‌నం.. కుమారుడికి తండ్రి క‌త్తిపోటు

Gurgaon |

గురుగ్రాంలో దిగ్భ్రాంతిక‌ర ఘ‌టన చోటు చేసుకుంది. యాప్ త్వ‌ర‌గా ఓపెన్ కావ‌డం లేద‌ని ఆవేశంలో ఉన్న ఓ వ్య‌క్తి త‌న 23 ఏళ్ల కుమారుడిని క‌త్తితో పొడిచాడు. పోలీసులు ఆదివారం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 64 ఏళ్ల అశోక్ సింగ్ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో సీనియ‌ర్ ఇంజినీర్‌గా ప‌నిచేసి రిటైర్ అయ్యారు.

భార్య‌, త‌న 23 ఏళ్ల కుమారుడు ఆదిత్య సింగ్‌ల‌తో క‌లిసి ఉంటున్న అశోక్.. ఇటీవ‌లే ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దానికి సంబంధించిన పేమెంట్ చెల్లించ‌డానికి ఫోన్‌లో పేమెంట్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల‌ని భార్య‌కు సూచించారు.

ఆమె ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా యాప్ ఓపెన్ కాక‌పోవ‌డంతో భార్య‌తో గొడ‌వ‌పెట్టుకున్నారు. ఇది గ‌మ‌నించి వారిని నిలువ‌రించడానికి కుమారుడు ప్ర‌య‌త్నించాడు. ఈ క్ర‌మంలో స‌హ‌నం కోల్పోయిన అశోక్ సింగ్.. కుమారుడు ఆదిత్య‌ను ఛాతిపై క‌త్తితో పొడిచాడు.

స్థానికులు వెంట‌నే అత‌డిని ద‌గ్గ‌ర్లోని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా వైద్యులు త‌క్ష‌ణం చికిత్స చేసి అత‌డి ప్రాణాలు ర‌క్షించారు. అత‌డి ఛాతిపై రెండు లోతైన గాయాల‌య్యాయ‌ని పోలీసులు తెలిపారు. అశోక్‌పై మార‌ణాయుధాల‌తో దాడి చేశార‌ని సెక్ష‌న్ 324 కింద కేసు పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు.