Hanmakonda | కటాక్షపూర్ ఆత్మకూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం

Hanmakonda కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ నలుగురు అక్కడికక్కడే మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం మృతులు కాశిబుగ్గ వాసులుగా సమాచారం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు -కటాక్షపూర్ ప్రధాన రహదారిపై రోడ్డులో కారును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ తో పాటు మరొకరికి […]

Hanmakonda | కటాక్షపూర్ ఆత్మకూరు మధ్య ఘోర రోడ్డు ప్రమాదం

Hanmakonda

  • కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ
  • నలుగురు అక్కడికక్కడే మృతి
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
  • ఒకరి పరిస్థితి విషమం
  • మృతులు కాశిబుగ్గ వాసులుగా సమాచారం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు -కటాక్షపూర్ ప్రధాన రహదారిపై రోడ్డులో కారును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది.

ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతిచెందిన వీరంతా ఉదయం కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ దారుణ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు కాగా, తీవ్ర గాయాలపాలైన వారు కారులోనే ప్రాణాలు విడిచినట్లు స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.

వీరంతా గ్రేటర్ వరంగల్ పరిధి కాశీబుగ్గ వాసులుగా తెలుస్తోంది. సంఘటనా స్థలం రక్తసిక్తంగా మారింది. నలుగురి మృదేహాలు చిధ్రమయ్యాయి. చూసేందుకు పరిస్థితి భయానకంగా ఉంది. సంఘటన సమాచారం అందగానే ఘ‌ట‌నా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మృతులు వరంగల్ నగరంలోని కాశిబుగ్గ సొసైటీ కాలనీకి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన నలుగురి వివరాలు ఇలా ఉన్నాయి. అనుముల నరసింహస్వామి (50), వెల్దండి సాంబరాజు(42), వెల్దండి ఆకాంక్ష (26) వెల్దండి లక్ష్మి ప్రసన్న (6), గాయపడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
అనుముల రాజేశ్వరి (50) అనుముల అక్షిత (20)లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.