Harihara Veeramallu: హరిహర వీరమల్లు నుంచి అదిరే సాంగ్ !

Harihara Veeramallu: హరిహర వీరమల్లు నుంచి అదిరే సాంగ్ !

Harihara Veeramallu: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ అభిమానుల్లో రోజురోజుకు క్రేజ్ పెంచుతుంది. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా సిద్ధమవుతున్న ఈ సినిమా ప్రమోషన్ జోరు పెంచారు. సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్ పై చిత్రీకరించిన తారా తార నా కళ్లు..వెన్నెల పూత నా ఒళ్లు…ఆకాశాన్ని ఎంతకని వెల కడతారు అన్న సాంగ్ లిరికల్ వీడియోను బుధవారం విడుదల చేశారు.

ఈ పాటలో నిధి ఆగర్వాల్ హాట్ హాట్ అందాలతో..స్టెప్పులతో ఆకట్టుకుంది. జూన్‌ 12న ప్రేక్షకుల ముందుకురానున్న హరిహర వీరమల్లుపై ‘తార తార’ అంటూ సాగే పాట మరింత ఆసక్తి పెంచేసింది. ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్‌ అందించగా లిప్సిక, ఆదిత్య దీన్ని ఆలపించారు.