Mega Heroes | ఆరు నెలల్లో 1000 కోట్ల లక్ష్యంతో మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ దండయాత్ర .. సాధ్యమేనా?
Mega Heroes | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అరుదైన ప్రభంజనానికి సిద్ధమవుతున్నారు. గతంలో కొంతకాలం నిరాశలు ఎదురైనా, ఇప్పుడు వరుస హిట్లతో తమ స్టార్‌డమ్‌కు మరోసారి పదును పెట్టారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.1000 కోట్ల గ్లోబల్ వసూళ్లను సాధించే దిశగా అడుగులు వేస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Mega Heroes | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అరుదైన ప్రభంజనానికి సిద్ధమవుతున్నారు. గతంలో కొంతకాలం నిరాశలు ఎదురైనా, ఇప్పుడు వరుస హిట్లతో తమ స్టార్‌డమ్‌కు మరోసారి పదును పెట్టారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా రూ.1000 కోట్ల గ్లోబల్ వసూళ్లను సాధించే దిశగా అడుగులు వేస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సెప్టెంబర్‌లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకెళ్లింది. ఈ చిత్రం దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి పవన్ మార్కెట్ స్టామినాను మరోసారి నిరూపించింది.
ఆ వెంటనే సంక్రాంతి బరిలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ఘన విజయం అందుకున్నారు. ఇప్పటికే రూ.300 కోట్ల మార్కును దాటిన ఈ సినిమా ఇంకా అదే ఊపులో వసూళ్లు రాబడుతూ లాంగ్ రన్‌లో రూ.400 కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రెండు సినిమాల ద్వారానే మెగా బ్రదర్స్ ఖాతాలో ఇప్పటివరకు సుమారు రూ.650 కోట్ల వసూళ్లు చేరాయి. ఇక మెగా అభిమానుల దృష్టి మొత్తం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’పైనే ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మార్చిలో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఒకవేళ ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే సులభంగా రూ.350 కోట్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. అలా జరిగితే సెప్టెంబర్ నుంచి మార్చి వరకు కేవలం ఆరు నెలల్లోనే మెగా హీరోల మూడు భారీ సినిమాల ద్వారా రూ.1000 కోట్లకు పైగా గ్లోబల్ వసూళ్లు సాధించినట్లవుతుంది. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వసూళ్లు సాధించడం భారతీయ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డుగా నిలుస్తుంది. ఇదిలా ఉండగా భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో కూడా మెగా క్యాంప్ బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన తదుపరి సినిమాకు రెడీ అవుతుండగా, చిరంజీవి బాబి దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ కూడా చిరంజీవి లైనప్‌లో ఉంది. ఈ నేపధ్యంలో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వెయ్యి కోట్ల మార్కును చిరు–పవన్ నిజంగా అందుకుంటారా లేదా అన్నది టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram