Hawaii | నగరం మొత్తం తగలబడినా.. చెక్కుచెదరని పురాతన చర్చ్
Hawaii | భయంకర కార్చిచ్చుకు గురై బూడిద కుప్పలు, కాలిన శవాలతో శ్మశానంలా మారిన హవాయీ (Hawaii) కి సంబంధించి తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ కార్చిచ్చుల ధాటికి పూర్తిగా నేలమట్టమైన లాహైనా (Lahaina) నగరంలోని ఒక పురాతన చర్చ్ (Church) )అసలు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా.. మంటలకు బూడిద కాకుండా ఎప్పటిలానే ఉందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. చుట్టూ కాలిపోయిన చెట్లు, ఇళ్ల మధ్యన తళతళలాడుతున్న ఈ చర్చ్ వీడియోలు సైతం […]

Hawaii |
భయంకర కార్చిచ్చుకు గురై బూడిద కుప్పలు, కాలిన శవాలతో శ్మశానంలా మారిన హవాయీ (Hawaii) కి సంబంధించి తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ కార్చిచ్చుల ధాటికి పూర్తిగా నేలమట్టమైన లాహైనా (Lahaina) నగరంలోని ఒక పురాతన చర్చ్ (Church) )అసలు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా.. మంటలకు బూడిద కాకుండా ఎప్పటిలానే ఉందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.
చుట్టూ కాలిపోయిన చెట్లు, ఇళ్ల మధ్యన తళతళలాడుతున్న ఈ చర్చ్ వీడియోలు సైతం ఇప్పుడు ఇన్‌స్టా, ఎక్స్ వేదికల్లో వైరల్‌గా మారాయి. మారియా లనాకిలా క్యాథలిక్ చర్చ్‌గా పిలిచే ఈ నిర్మాణాన్ని 1846లో నిర్మించారు. భీకరంగా వ్యాపించిన మంటల ధాటికి నగరం మొత్తం నాశనమైంది. ఈ చర్చి మాత్రం అలానే ఉంది అని టెరెన్స్ వాతనాబె అనే పాస్టర్ వివరించారు.
Maria Lanakila Church in Lahaina is still standing