Heavy Rains | విస్తరించిన నైరుతి.. 20వ తేదీ వరకు భారీ వర్షాలు
Heavy Rains విధాత: ఈ సీజన్‌లో ఆలస్యంగానైనా నైరుతి రాష్ట్ర మంతా విస్తరించింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశ వైపుకు వంగిందని పేర్కొన్నది. ఇది రాగల 48 గంటల్లో […]
Heavy Rains
విధాత: ఈ సీజన్‌లో ఆలస్యంగానైనా నైరుతి రాష్ట్ర మంతా విస్తరించింది. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశ వైపుకు వంగిందని పేర్కొన్నది.

ఇది రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. మరొక ఆవర్తనము దక్షిణ చత్తీస్ ఘడ్ మీద కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిమి ఎత్తువరకు విస్తరించి ఉందని చెప్పింది. కాగా అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉందని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో ఈనెల20వ తేదీ వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇతర జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.
అలాగే గంటకు 30 నుండి 40 కి.మీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల19,20 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram