High Court | ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
High Court | ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. టీచర్ యూనియన్ నేతలకు పది అదనపు పాయింట్లను తప్పుపట్టిన కోర్టు యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు అనుమతి ఇచ్చింది. ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడాన్ని కోర్టు అనుమతించింది. భార్యభర్తలు కలిసి ఉండాలన్న నిబంధన ఉద్దేశమన్న హైకోర్టు టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫున చిక్కుడు ప్రభాకర్, […]
High Court |
ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. టీచర్ల బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది.
టీచర్ యూనియన్ నేతలకు పది అదనపు పాయింట్లను తప్పుపట్టిన కోర్టు యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు అనుమతి ఇచ్చింది.
ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడాన్ని కోర్టు అనుమతించింది. భార్యభర్తలు కలిసి ఉండాలన్న నిబంధన ఉద్దేశమన్న హైకోర్టు టీచర్ల బదిలీలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
పిటిషనర్ల తరఫున చిక్కుడు ప్రభాకర్, కృష్ణయ్య వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచందర్ రావు వాదనలు వినిపించారు.
ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి: టిఎస్ యుటిఎఫ్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ పై గత ఏడు నెలలుగా కొనసాగుతున్న స్టేను హైకోర్టు ఎత్తివేయడాన్నిస్వాగతిస్తున్నట్లు టిఎస్ యుటిఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. గుర్తింపు సంఘాల రాష్ట్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక పాయింట్లను తాత్కాలికంగా తొలగిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తున్నామని పేర్కొన్నది.
ఎనిమిదేళ్ళుగా పదోన్నతులు, ఐదేళ్ళుగా బదిలీలు జరగక వేలాది పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తీరని నష్టం జరిగిందని తెలిపింది. ఇప్పటికే తీవ్రమైన జాప్యం జరిగినందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరుతున్నట్లు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. జంగయ్య, చావ రవిలు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram