Hydra| రూ.3,600కోట్ల భూముల రక్షణకు రంగంలోకి హైడ్రా
హైదరాబాద్ లోని కొండాపూర్ లో రూ.3,600ప్రభుత్వ భూముల స్వాధీనానికి హైడ్రా రంగంలోకి దిగింది. ఆర్టీఏ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్‌లో ఉన్న సర్వే నంబర్ 59లోని 36ఎకరాల భూములలో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు.
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ (Hyderabad)లోని కొండాపూర్ (Kondapur)లో రూ.3,600 ప్రభుత్వ భూముల స్వాధీనానికి హైడ్రా(Hydra)రంగంలోకి దిగింది. ఆర్టీఏ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్‌లో ఉన్న సర్వే నంబర్ 59లోని 36ఎకరాల భూములలో(Government Lands) అక్రమ నిర్మాణాలను ( Land Encroachment) హైడ్రా సిబ్బంది తొలగించారు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టిన హైడ్రా ..కూల్చివేతల ప్రాంతాంలోకి జనాన్ని అనుమతించలేద. రెండు కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసిన హైడ్రా స్థానికులను అడ్డుకుంది. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని ఖాళీ చేయించింది.
ఈ భూములు 60ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్నాయని రైతులు వాదిస్తున్నారు. అయితే ఈ భూముల వివాదంలో హైకోర్టు తీర్పు మేరకు హైడ్రా ఆక్రమణల తొలగింపును చేపట్టింది. చుట్టూ కంచె వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram