High Court | తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్ అరాధే
High Court మరో నాలుగు హైకోర్టులకు సీజేల నియామయం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్‌కోషి తెలంగాణకు బదిలీ హైదరాబాద్, విధాత: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు. తెలంగాణ సీజేగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో జస్టిస్ అలోక్ అరాధేను నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న […]

High Court
- మరో నాలుగు హైకోర్టులకు సీజేల నియామయం
- ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్‌కోషి తెలంగాణకు బదిలీ
హైదరాబాద్, విధాత: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు. తెలంగాణ సీజేగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో జస్టిస్ అలోక్ అరాధేను నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ అరాధేను నియమిస్తున్నట్టు బుధవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ట్వీట్ చేశారు. ఇతనితో పాటు ఒరిస్సా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుభాషిశ్ తాళపత్రను అదే హైకోర్టుకు సీజేగా, అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సునీతా అగర్వాల్ ను గుజరాత్ హైకోర్టు సీజేగా, గుజరాత్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఆశిశ్ జె.దేశాయ్‌ను కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
అదే విధంగా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పి.సామ్ కోషిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. త్వరలోనే వీరు బాధ్యతలు తీసుకోనున్నారు.