High Court | ఒక్క రోజు-71 తీర్పులు.. హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా కొత్త రికార్డు

High Court విధాత: ఒక్క కేసు తీర్పు రావడానికి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఈ రోజుల్లో న్యాయ చరిత్రలోనే కొత్త అధ్యాయం లిఖించారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా. కేవలం ఒక్క రోజులోనే 71 కేసులలో తీర్పులను వెల్లడించి శభాష్‌ అనిపించుకున్నారు. అలా అని నందా ఇచ్చిన తీర్పులు అషామాషివి కాదు హైకోర్టు న్యాయ చరిత్రలోనే విశేషమైనవి, అసమానమైనవి అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. వేసవి సెలవుల తర్వాత హైకోర్టు పున: ప్రారంభం రోజునే అనేక […]

High Court  | ఒక్క రోజు-71 తీర్పులు.. హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా కొత్త రికార్డు

High Court

విధాత: ఒక్క కేసు తీర్పు రావడానికి దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఈ రోజుల్లో న్యాయ చరిత్రలోనే కొత్త అధ్యాయం లిఖించారు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నందా. కేవలం ఒక్క రోజులోనే 71 కేసులలో తీర్పులను వెల్లడించి శభాష్‌ అనిపించుకున్నారు. అలా అని నందా ఇచ్చిన తీర్పులు అషామాషివి కాదు హైకోర్టు న్యాయ చరిత్రలోనే విశేషమైనవి, అసమానమైనవి అని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

వేసవి సెలవుల తర్వాత హైకోర్టు పున: ప్రారంభం రోజునే అనేక తీర్పులు వెల్లడించారు. మరో వైపు న్యాయమూర్తి సూరేపల్లి నందా కోర్టులో తీర్పులు చెప్పడం ద్వారా న్యాయ ప్రక్రియలో పారదర్శకతను పెంచాయి. ఒకేసారి గణనీయ సంఖ్యలో తీర్పులు నిస్సందేహంగా కేసుల బ్యాక్‌లాగ్‌ను కొంతమేరకు తగ్గించందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కోర్టులో పేరుకుపోతున్న కేసుల నేపధ్యంలో బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయడం ద్వారా న్యాయస్థాన వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. వ్యాజ్యదారులకు సకాలంలో న్యాయాన్ని అందించడంలో సహాయపడుతుంది. న్యాయవ్యవస్థ యొక్క సమర్థవంతమైన పనితీరును ప్రోత్సహిస్తుంది. జడ్జి సూరేపల్లి నందా ఒకేసారి పెద్ద ఎత్తున తీర్పులతో న్యాయ వ్యవస్థ పై ప్రభావం పడి విశ్వసనీయతకు దోహదం చేస్తాయి.

సరేపల్లి నందా 28 ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనేక సివిల్‌, క్రిమినల్‌ కేసులు చేశారు. 1969లో జన్మించిన నందా బీఏ ఇంగ్లీష్ లిట‌రేచర్‌ చదివారు, ఆత‌రువాత ఎల్‌ఎల్‌బీ విద్యను అభ్యసించిన నందా 1993లో హైకోర్టు న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.

లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, బార్‌ కౌన్సిల్‌ తరపున అనేక సేవా కార్యక్రమాలలో సేవలు అందించిన నందాను ఇటీవల హైకోర్టు డిజిగ్నేటెడ్‌ సీనియర్‌ న్యాయవాదిగా గుర్తించి న్యాయమూర్తిగా అవకాశం ఇచ్చింది.