Highcourt | హైదరాబాద్, విధాత: రాష్ట్రంలోని గ్రామీణ తాలూకా జిల్లా స్థాయిలోని ఆసుపత్రుల్లో ఉన్న వసతులపై నివేదిక అందజేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రిలో ఉండాల్సిన వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతమంది? ప్రస్తుతం ఉన్నది ఎంతమంది? వైద్య రంగానికి ఇస్తున్న బడ్జెట్ ఎంత? గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు ఎలా పనిచేస్తున్నాయి? లాంటి వివరాలను నివేదికలో వెల్లడించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. నాగర్ కర్నూల్ జిల్లా కు చెందిన ఓ గర్భిణీ మృతి […]
Highcourt |
హైదరాబాద్, విధాత: రాష్ట్రంలోని గ్రామీణ తాలూకా జిల్లా స్థాయిలోని ఆసుపత్రుల్లో ఉన్న వసతులపై నివేదిక అందజేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
ఆస్పత్రిలో ఉండాల్సిన వైద్యులు, వైద్య సిబ్బంది ఎంతమంది? ప్రస్తుతం ఉన్నది ఎంతమంది? వైద్య రంగానికి ఇస్తున్న బడ్జెట్ ఎంత? గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు ఎలా పనిచేస్తున్నాయి? లాంటి వివరాలను నివేదికలో వెల్లడించాలని ఆదేశించింది.
తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. నాగర్ కర్నూల్ జిల్లా కు చెందిన ఓ గర్భిణీ మృతి అంశం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.