Snake Bite | ఇదో వింత కేసు.. నెల రోజుల వ్యవధిలో ఆరు సార్లు పాము కాటేసినా.. ప్రాణాలతో బతికాడు..
Snake Bite | నిజంగా ఇది వింత కేసే.. ఎందుకంటే ఒక వ్యక్తి నెల రోజుల వ్యవధిలోనే ఆరు సార్లు పాము కాటుకు గురయ్యాడు. అయినప్పటికీ అతను ప్రాణాలతో బతికాడు. తన సొంతూరు నుంచి అత్తగారింటికి వెళ్లిన కూడా పాము కాటు తప్పలేదట. అది కూడా శని, ఆదివారాల్లోనే పాము కాటు వేసిందట.

Snake Bite | నిజంగా ఇది వింత కేసే.. ఎందుకంటే ఒక వ్యక్తి నెల రోజుల వ్యవధిలోనే ఆరు సార్లు పాము కాటు( Snake Bite )కు గురయ్యాడు. అయినప్పటికీ అతను ప్రాణాలతో బతికాడు. తన సొంతూరు నుంచి అత్తగారింటికి వెళ్లిన కూడా పాము కాటు తప్పలేదట. అది కూడా శని, ఆదివారాల్లోనే పాము కాటు వేసిందట. ఈ విచిత్రమైన సంఘటన గురించి తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్ వెళ్లాల్సిందే.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన వికాస్ దూబే( Vikas Dubey )కు 24 ఏండ్లు. అయితే ఈ ఏడాది జూన్ 2వ తేదీన వికాస్‌ను ఓ పాము కరిచింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు చికిత్స అందించడంతో బతికి పోయాడు. జూన్ 2 నుంచి జులై 6వ తేదీ వరకు అతన్ని ఆరుసార్లు పాము కరిచింది. పాము కరిచిన ప్రతిసారి ఆస్పత్రికి వెళ్లడం.. ప్రాణాలతో తిరిగి రావడం జరిగాయి.
అయితే నాలుగోసారి పాము కరిచినప్పుడు వికాస్ స్పృహ కోల్పోయాడు. అతని పరిస్థితి విషమంగా మారింది. మొత్తానికి అతన్ని వైద్యులు ప్రాణాలతో బతికించారు. ఈ పాము కరిచిన తర్వాత తాను ఉంటున్న గ్రామాన్ని విడిచిపెట్టి, వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని వైద్యులు సూచించారు.
అత్తగారింట్లో కూడా వదలని పాము..
వైద్యుల సూచన మేరకు తన అత్తగారిల్లు అయిన రాధానగర్‌కు వికాస్ వెళ్లిపోయాడు. అత్తగారింట్లో కూడా అతన్ని పాము వదిలిపెట్టలేదు. వికాస్ పాము కాటుకు గురవడం ఇది ఐదోసారి. ప్రాణాలతో బతికి బయటపడ్డ తమ కుమారుడిని పేరెంట్స్ తమ సొంతూరికి తీసుకొచ్చారు. మళ్లీ జులై 6వ తేదీన సొంతింట్లోనే పాము కరిచింది. ఈసారి కూడా అతని ఆరోగ్య పరిస్థితి విషమించినప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే వికాస్‌ను శని, ఆదివారాల్లోనే పాము కరిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదంతా ఏదో వింతగా ఉందని కుటుంబ సభ్యులతో పాటు వికాస్ పేర్కొన్నాడు.