Hiranyakashyapa | రానా Vs గుణశేఖర్‌.. మధ్యలోకి త్రివిక్రమ్‌! ఎవరినీ వదలనంటూ గుణశేఖర్ మాస్ వార్నింగ్

Hiranyakashyapa | విధాత‌: గుణశేఖర్ సినిమా అంటే.. ఆయన సినిమాలు కథ పరంగా, సెట్స్ పరంగా ఓరేంజ్‌లో ఉంటాయని ప్రేక్షకులు అంచనా వేసుకోవచ్చు. 2003లో ‘ఒక్కడు’ సినిమాకి దాదాపు 8 నంది అవార్డులను అందుకున్నాడు. ఆ సంవత్సరానికి అత్యధిక వసూళ్ళను రాబట్టిన సినిమా కూడా అదే. ఆ తరువాత అతని దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్స్ కావడంతో నిర్మాతలు గుణశేఖర్‌తో సినిమా అంటేనే కంగారు పడేలా మారిపోయింది పరిస్థితి. అయితే 2015లో తీసిన ‘రుద్రమదేవి’ సినిమాతో […]

Hiranyakashyapa | రానా Vs గుణశేఖర్‌.. మధ్యలోకి త్రివిక్రమ్‌! ఎవరినీ వదలనంటూ గుణశేఖర్ మాస్ వార్నింగ్

Hiranyakashyapa |

విధాత‌: గుణశేఖర్ సినిమా అంటే.. ఆయన సినిమాలు కథ పరంగా, సెట్స్ పరంగా ఓరేంజ్‌లో ఉంటాయని ప్రేక్షకులు అంచనా వేసుకోవచ్చు. 2003లో ‘ఒక్కడు’ సినిమాకి దాదాపు 8 నంది అవార్డులను అందుకున్నాడు. ఆ సంవత్సరానికి అత్యధిక వసూళ్ళను రాబట్టిన సినిమా కూడా అదే. ఆ తరువాత అతని దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్స్ కావడంతో నిర్మాతలు గుణశేఖర్‌తో సినిమా అంటేనే కంగారు పడేలా మారిపోయింది పరిస్థితి.

అయితే 2015లో తీసిన ‘రుద్రమదేవి’ సినిమాతో గుణశేఖర్ కాస్త ట్రాక్‌లోకి వచ్చాడనే అంతా అనుకున్నారు. కానీ ‘శాకుంతలం’తో మళ్లీ డిజాస్టర్ టాక్ అందుకున్నాడు. ఈ కోవలోనే ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రాజెక్ట్ కూడా తన చేయి దాటిపోతుందని తెలిసి మనస్తాపానికి గురై మాస్ వార్నింగ్ ఇచ్చేంత వరకూ వెళ్లాడు. విషయంలోకి వెళితే..

గుణశేఖర్ ఎప్పటి నుంచో రాక్షసరాజు ‘హిరణ్య కశ్యప’ పేరుతో ఓ సినిమా అనుకుంటున్నాడు గుణశేఖర్. దాని కోసం దాదాపు ఐదేళ్ళుగా పని చేస్తున్నాడు కూడా. అయితే ఈ కథకు రానా దగ్గుబాటి హీరో అని అనుకుని అతనికి కథ కూడా చెప్పాడు. ఇంతలో ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ నుంచి గుణశేఖర్ తప్పుకున్నాడు.

చాన్నాళ్ళ క్రితం రానా హీరోగా, సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందనే టాక్ నడిచింది. కానీ సడెన్‌గా అందులోంచి గుణశేఖర్ తప్పుకోవడం, ఇప్పుడు రానా ‘హిరణ్య కశ్యప’ పేరుతో తన తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించడం, కాస్త దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయం గుణశేఖర్ వరకు చేరుకోవడంతో.. ఆయన కాస్త ఘాటుగానే స్పందించాడు.

ప్రాజెక్ట్ కె మూవీ సభ్యులతో కలిసి అమెరికాలో జరిగిన కామిన్ కాన్ 2023 వేడుకల్లో పాల్గొన్న రానా.. తన నెక్ట్ ప్రాజెక్ట్ ‘హిరణ్య కశ్యప’ అని.. దీనికి స్టార్ డైరెక్టర్ కమ్ రైటర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కథను అందిస్తున్నాడంటూ ఓ ప్రకటన చేసేసరికి గుణశేఖర్ ఈ విషయంపై ఫైర్ అయ్యాడు.

తను రానాతో సినిమా అనుకున్నప్పుడు మధ్యలో ‘శాకుంతలం’ చేయాల్సి రావడంతో కాస్త గ్యాప్ వచ్చింది. తీరా ఇప్పుడు వర్క్ విషయానికి వచ్చేసరికి తనని తప్పించి వేరేవాళ్ళతో అనౌన్స్ చేయడాన్ని జీర్ణంచు కోలేక మనసులోని బాధను ఆయన మరో రకంగా తెలియజేశాడు.

ఏపీ ఆళ్ళగడ్డకు దగ్గరలో ఉన్న అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ దేవుడి కథను కేంద్రంగా తీసుకుని సినిమాగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ చిత్తశుద్ధిని గమనిస్తుంటాడని గుర్తుంచుకోవాలని, అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది అని పోస్ట్ చేశాడు.