horoscope | ఈ రాశులవారికి ధనవ్యయం.. కలహాలు.. 26-03-2023 ఆదివారం రాశి ఫ‌లాలు

horoscope | మేష రాశి:- సర్వత్రా అనుకూలంగా వుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మోసపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం. సంతోషాన్నిస్తుంది. వివాదాలలో విజయం లభిస్తుంది. వృష‌భ రాశి:- మీరుకోరుకున్న స్థానం లభిస్తుంది. శరీర గాయాల నుండి ఉపశమనం లభిస్తుంది. శత్రువులను దూరంగా ఉంచుతారు. కోపం ప్రదర్శించవలసి వస్తుంది. ప్రయత్నములు సిద్ధిస్తాయి. ధన, వస్తు లాభము ఉంటాయి. మిథున రాశి:- వృత్తి ఉద్యోగాలలో వాగ్యాదములకు అవకాశములున్నాయి. భయం ఏర్పడవ‌చ్చును. చివరి దశలలో ప్రయత్నాలు నిష్ఫలమౌతాయి. సోమరితనం […]

horoscope | ఈ రాశులవారికి ధనవ్యయం.. కలహాలు.. 26-03-2023 ఆదివారం రాశి ఫ‌లాలు

horoscope | మేష రాశి:- సర్వత్రా అనుకూలంగా వుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మోసపోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం. సంతోషాన్నిస్తుంది. వివాదాలలో విజయం లభిస్తుంది.

వృష‌భ రాశి:- మీరుకోరుకున్న స్థానం లభిస్తుంది. శరీర గాయాల నుండి ఉపశమనం లభిస్తుంది. శత్రువులను దూరంగా ఉంచుతారు. కోపం ప్రదర్శించవలసి వస్తుంది. ప్రయత్నములు సిద్ధిస్తాయి. ధన, వస్తు లాభము ఉంటాయి.

మిథున రాశి:- వృత్తి ఉద్యోగాలలో వాగ్యాదములకు అవకాశములున్నాయి. భయం ఏర్పడవ‌చ్చును. చివరి దశలలో ప్రయత్నాలు నిష్ఫలమౌతాయి. సోమరితనం వలన నష్టపోతారు. పెద్దలతో అభిప్రాయభేదాలు వుండవచ్చును.

కర్కాటక రాశి:- కోపము వలన కలహాలు ఏర్పడవచ్చును. శరీరంలో వేడి అధికం కావడం. కార్యభంగముల వలన మనశ్చాంచల్యము కలుగుతుంది. ఇతరుల తప్పులకు మీరు భాధ్యత వహించాల్సివస్తుంది.

సింహ రాశి:- ప్రభుత్వ అధికారులకు ప్రశంసలు లభిస్తాయి. చేయవలసిన పనులలో ఆటంకాలెదురైననూ విజయవంతంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన చర్చలలో వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. పాత బాకీలు వ‌సుల‌వుతాయి. ధన లాభ‌ముంటుంది.

కన్యా రాశి:- అంచనాలు తప్పుతాయి. పొరపాట్లుకు పశ్చాత్తాపం కలుగుతుంది. ఇత‌రుల‌తో మాట్లాడేటప్పుడు నిగ్రహంగా వుండండి. వృథాగా ధనవ్య‌య‌మ‌మ్యే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి, మనస్సులో ఆందోళనగా వుండ‌వ‌చ్చును.

తులా రాశి:- క్రీడాకారులకు విజయాలు లభిస్తాయి. మంచి వ్యక్తులతో కలసి సత్సంగంలో పాల్గొంటారు. సన్మానములు పొందెదరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపుతారు. స్థిరాస్తుల కొనుగోలు యత్నములు ఫలిస్తాయి.

వృశ్చిక రాశి:- మిత్రులతో విభేదాలు కలుగుతాయి. గృహ మూలక అశాంతి కలుగవచ్చును. విదేశీ ప్రయాణములకు అనుకులంగా వుండదు. ధనవ్యయమైననూ పనులు పూర్తికావు. దుర్వార్తా శ్రవణము కలుగవచ్చును.

ధనుస్సు రాశి:- కలహించిన వారితోనే కలిసి పనిచేయవలసి వస్తుంది. సంతానమూలక సౌఖ్యన్ని పొందుతారు. రావలసిన ధనం చేతి కందుతుంది. బంధుమిత్రులుతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులు పూర్తి చేయడంలో కొంత కాఠిన్యాన్ని ప్రదర్శిస్తారు.

మకర రాశి:- అసాధ్యమనుకున్న పనులు పట్టుదలతో సాధిస్తారు. వివాహ ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. నూతన వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. దైవ కార్యములలో పాల్గొంటారు.

కుంభ రాశి: – ధైర్యం లేకపోవడం వలన పనులు ఆలస్యమవుతాయి. అత్మన్యూనతకు లోనవుతారు. దీర్ఘకాలిక వ్యాధులు భాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాల మూల‌కంగా అశాంతి కలుగుతుంది. సంతాన మూలకంగా చీకాముకులు కలుగవచ్చును.

మీన రాశి:- రాజకీయ నాయకులకు అపవాదులు కలుగవచ్చును. శుభకార్యక్రమ నిర్వ‌హణలో ఇబ్బందులు పడవలసి వస్తుంది. అజీర్ణము మూలకంగా శరీర బాధలుండవచ్చును. మనస్తాపము కలుగుతుంది. వ్యవహారమూలక చిక్కులేర్పడవచ్చును.

– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్‌ నంబర్‌ : +91 99490 11332.