ఈ రాశుల వారికి ఆదాయానికి మించిన ఖర్చులు, కీర్తి ప్రతిష్టలు.. 31.03.2023 శుక్రవారం రాశి ఫలాలు..
మేష రాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ సభ్యులపై అపవాదులు బాధిస్తాయి. చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు. చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమించాల్సివస్తుంది. వృషభ రాశి: పెద్దల ఆదరణ లభిస్తుంది. బంగారు వస్తువులను సంగ్రహిస్తారు. అక్కాచెల్లెళ్ళతో సంభాషణలు ఆనందాన్నిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. స్థిరాస్థి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిథున రాశి:- మీరు ఊహించని విధంగా కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రముఖలతో కలయికలు లాభిస్తాయి. సోదరుల సహకారం లభిస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. అత్మస్థైర్యముతో కార్య […]

మేష రాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ సభ్యులపై అపవాదులు బాధిస్తాయి. చేతిలో డబ్బులేక ఇబ్బంది పడతారు. చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమించాల్సివస్తుంది.
వృషభ రాశి: పెద్దల ఆదరణ లభిస్తుంది. బంగారు వస్తువులను సంగ్రహిస్తారు. అక్కాచెల్లెళ్ళతో సంభాషణలు ఆనందాన్నిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. స్థిరాస్థి ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
మిథున రాశి:- మీరు ఊహించని విధంగా కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రముఖలతో కలయికలు లాభిస్తాయి. సోదరుల సహకారం లభిస్తుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. అత్మస్థైర్యముతో కార్య సిద్ధి కలుగుతుంది.
కర్కాటక రాశి: నూతన కార్యారంభములు ప్రతికూల ఫలితాలనిస్తాయి. నిందావాక్యములను వినవలసి వస్తుంది. శ్రమ ఎక్కువౌతుంది. స్థిరాస్థి మూలక అశాంతి కలుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి.
సింహ రాశి: వివాహ ప్రయత్నములు ఫలిస్తాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. పట్టుదలతో ప్రయత్నాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. బంగార వస్తువులను సంగ్రహిస్తారు.
కన్యా రాశి: వృధా శ్రమ నిరాశకు గురిచేస్తుంది. నిద్రాసౌఖ్యము తక్కువగా వుంటుంది. ప్రయాణాల మూలకంగా అశాంతి కలుగుతుంది. దీర్ఘ కాలిక వ్యాధుల పట్ల జాగ్రత్తగా వుండాలి. వస్తుందనుకున్న ధనం చేతికి రాదు.
తులా రాశి:- వృత్తి, ఉద్యోగాలలో అనుకూలతలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మోసగాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక ధన వ్యయము కలుగుతుంది.
వృశ్చిక రాశి:- పెద్దల సహకారం లభిస్తుంది. కవులు, పండితులు నూతన గ్రంథరచనలు చేస్తారు. నూతన కార్యారంభము ఆనందాన్నిస్తుంది. సంతాన మూలకముగా సౌఖ్యం లభిస్తుంది.
ధనుస్సు రాశి: అనుకున్న పనులు వాయిదా వేస్తారు. అకస్మాత్తుగా వేరే పనులు పూర్తి చేస్తారు, బంధుమిత్రుల మూలకంగా అశాంతి కలుగుతుంది. వృధా సంచారముల వలన ధనవ్యయము కలుగుతుంది.
మకర రాశి: మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనతలు వుండవచ్చును. ఇష్టము లేని పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ మూలక అశాంతి కలుగవచ్చును. ధన మూలక అశాంతి కలుగవచ్చును.
కుంభ రాశి: మిత్రుల కలయికల మూలకంగా ఆనందాన్ని పొందుతారు. విద్యార్థులు చర్చల ద్వారా సత్ఫలితాలను పొందుతారు. క్రీడాకారులు శ్రమకు తగిన గౌరవాన్ని పొందుతారు. ధన ప్రాప్తి కలుగుతుంది.
మీన రాశి: మీరు కొరుకున్న పనులు నిర్వహిస్తారు. ప్రమాదాల నుండి బయటపడతారు. అక్కాచెల్లెళ్ళతో అపార్ధాలు తొలగిపోతాయి. శత్రువులను దూరంగా ఉంచుతారు. నష్ట ధన ప్రాప్తి కలుగుతుంది.
– తూండ్ల కమలాకర శర్మ సిద్ధాంతి,
కూకట్‌పల్లి, హైదరాబాద్
ఫోన్ నంబర్ : +91 99490 11332