రోజుకు రూ.300లతో రూ.50 లక్షల రాబడి
-సుకన్య సమృద్ధి యోజన లాభాలు తెలుసా విధాత: సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) ఓ కేంద్ర ప్రభుత్వ పథకం. తల్లిదండ్రులు తమ ఆడపిల్లల కోసం ఇందులో పొదుపు ఖాతాలను తెరుచుకోవచ్చు. ఇందులో పెట్టిన నగదుపై వడ్డీనీ పొందవచ్చు. ఏటా 8.5 శాతం వడ్డీరేటు లభిస్తుంది. అమ్మాయిల చదువు, పెండ్లి ఖర్చులకు ఈ సొమ్ము ఎంతగానో ఉపకరిస్తుంది. భవిష్యత్తులో మీ కూతురికి ఆర్థిక భరోసా అందేలా తక్కువలో తక్కువగా నెలకు రూ.250 కూడా ఈ పథకం ద్వారా పెట్టుబడిగా […]

-సుకన్య సమృద్ధి యోజన లాభాలు తెలుసా
విధాత: సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) ఓ కేంద్ర ప్రభుత్వ పథకం. తల్లిదండ్రులు తమ ఆడపిల్లల కోసం ఇందులో పొదుపు ఖాతాలను తెరుచుకోవచ్చు. ఇందులో పెట్టిన నగదుపై వడ్డీనీ పొందవచ్చు. ఏటా 8.5 శాతం వడ్డీరేటు లభిస్తుంది. అమ్మాయిల చదువు, పెండ్లి ఖర్చులకు ఈ సొమ్ము ఎంతగానో ఉపకరిస్తుంది. భవిష్యత్తులో మీ కూతురికి ఆర్థిక భరోసా అందేలా తక్కువలో తక్కువగా నెలకు రూ.250 కూడా ఈ పథకం ద్వారా పెట్టుబడిగా పెట్టుకోవచ్చు.
ఈ పథకం ప్రయోజనాలివీ
ఈ పథకంలో భాగంగా మీ కూతురు పేరు మీద నమోదైన ఖాతాలో పెట్టుబడికున్న పరిమితి ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.1.5 లక్షలు. ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. పైగా రోజూ లేదంటే నెలనెలా చిన్నచిన్న మొత్తాలను జమ చేసి ఒకేసారి పెద్ద మొత్తాన్ని అందుకునే సౌలభ్యం ఎస్ఎస్‌వై ద్వారా కలుగుతున్నది. అల్పాదాయ వర్గాలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతగానో కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
ఇలా పెట్టుబడి పెడితే..
రోజుకు కేవలం రూ.35 పొదుపుతో ఎస్ఎస్‌వై ఖాతాలో నెలనెలా రూ.1,050ని జమచేస్తే ఇప్పుడున్న వడ్డీరేటు ప్రకారం నిర్ణీత వ్యవధిలో రూ.5 లక్షలపైనే రాబడిని మదుపరులు అందుకోవచ్చు. అలాగే రోజుకు రూ.100తో నెలనెలా రూ.3,000 పెట్టుబడి పెడితే దాదాపు రూ.16 లక్షల ప్రతిఫలాన్ని పొందవచ్చు. ఇలా రోజుకు రూ.200లతో నెలకు రూ.6,000 పెట్టుబడి ద్వారా రూ.33 లక్షలకుపైగా, రోజుకు రూ.300లతో నెలకు రూ.9,000 పెట్టుబడిపై రూ.50 లక్షలపైనే రాబడి దక్కించుకోవచ్చు.