ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు ఎంతవరకు నిజం?

ఉన్నమాట: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. హిమాచల్‌ ప్రదేశ్‌కు ఒకే విడుతలో ఎన్నికలు జరగగా.. గుజరాత్‌కు రెండు దఫాలుగా జరిగాయి. డిసెంబర్‌ 1న మొదటి విడుతలో 89 స్థానాలకు, రెండో విడుత డిసెంబర్‌ 5న 93 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఏవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే ఇవాళ పోలింగ్‌ ముగియగానే ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ప్రీపోల్‌ సర్వే ఫలితాల లెక్కనే ఎగ్జిట్‌పోల్స్‌లోనూ గుజరాత్‌లో కమల వికాసమే అని తేల్చాయి. […]

  • By: krs |    latest |    Published on : Dec 05, 2022 5:24 PM IST
ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు ఎంతవరకు నిజం?

ఉన్నమాట: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. హిమాచల్‌ ప్రదేశ్‌కు ఒకే విడుతలో ఎన్నికలు జరగగా.. గుజరాత్‌కు రెండు దఫాలుగా జరిగాయి. డిసెంబర్‌ 1న మొదటి విడుతలో 89 స్థానాలకు, రెండో విడుత డిసెంబర్‌ 5న 93 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఏవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే ఇవాళ పోలింగ్‌ ముగియగానే ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు వెల్లడయ్యాయి.

ప్రీపోల్‌ సర్వే ఫలితాల లెక్కనే ఎగ్జిట్‌పోల్స్‌లోనూ గుజరాత్‌లో కమల వికాసమే అని తేల్చాయి. వరుసగా ఏడోసారి అధికారంలోకి రాబోతున్నదని, గత అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాల దగ్గరే ఆగిపోయిన బీజేపీ 182 స్థానాల్లో ఈసారి సెంచరీ మార్క్‌ను దాటుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. దీనికి కారణాలను వెల్లడించాయి.

కాంగ్రెస్‌, ఆప్‌, ఐఎంఐం, బీఎస్పీ పార్టీల మధ్య ఓట్ల చీలికతో బీజేపీ భారీగా లాభం జరుగుతున్నదని తేల్చాయి. అలాగే మొదటి దఫాలో 63.13 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఇవాళ జరిగిన రెండవ దఫాలో సాయంత్రం 5 గంటల వరకు 58 శాతానికిపైగా పోలింగ్‌ నమోదైంది. ఇది గత ఎన్నికల కంటే తక్కువ శాతమని ఇది ప్రభుత్వానికి అనుకూలంగా మారిందనే వాదన కూడా వినిపిస్తున్నది.

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు ఎంతవరకు నిజమౌతాయి? వాటి శాస్త్రీయత ఎంత అనేది ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. సర్వే సంస్థలు మొత్తం నియోజకవర్గాల్లో కాకుండా సగం లేదా సగానికిపైగా నియోజకవర్గాల్లోని బూత్‌ల వారీగా 20-25 శాంపిల్స్‌ చొప్పున గరిష్టంగా 5 వేలు.. కనిష్టంగా 2 వేల వరకు తీసుకుని ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తుంటాయి.

వీటిలో కొన్ని దగ్గరగా రావొచ్చు. మరికొన్ని అంచనాలకు దూరంగా ఉండొచ్చు. కొన్నిసార్లు అంచనాలు పూర్తిగా తారుమారైన ఉదంతాలు ఉన్నాయి. అట్లాగని సర్వే ఫలితాలను తప్పుపట్టడానికి ఏమీ ఉండదు. కానీ పోటీచేసిన ప్రధాన పార్టీలు, అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు మునిగిపోతుంటారు.

ఇక 68 స్థానాలు ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ ఉండ బోతున్నద ని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చాయి. టైమ్స్‌నౌ, ఔటా ఆఫ్‌ ది బాక్స్‌ లాంటి రెండు సర్వే సంస్థలే బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాబోతున్నదనగా, పీపుల్స్‌ పల్స్‌, ఆత్మసాక్షి లాంటి సంస్థలు కాంగ్రెస్‌ మెజారిటీ మార్క్‌ను చేరుకుంటుందని, లేకపోతే మూడు నాలుగు స్థానాల్లో గెలిచే ఇతర పార్టీల అభ్యర్థులు ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తారని, అదీ కూడా కాంగ్రెస్‌కే అవకాశం ఉంటుందని ఆ సర్వేల సారాంశం.

అయితే గుజరాత్‌, హిమాచల్‌లో 2017 ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్ష్ నిజమయ్యాయా? అంటే లేదనే చెప్పాలి. హిమాచల్‌ ప్రదేశ్‌లో మాత్రమే ప్రజలు మార్పు కోరుకుటున్నారని బీజేపీకి 44 స్థానాలు రాబోతున్నాయని చెప్పాయి. అందుకు తగ్గట్టుగానే వచ్చాయి.

కానీ గుజరాత్‌ విషయంలో గతంలోనూ 110 పైగా అసెంబ్లీ సీట్లు బీజేపీ గెలువబోతున్నదని చెప్పాయి. కానీ 99 స్థానాల దగ్గరే ఆగిపోయింది. 10-15 స్థానాల వ్యత్యాసం కనిపించింది. కాబట్టి ఓటర్లు ఏం తీర్పు చెప్పబోతున్నారు అన్నది డిసెంబర్‌ 8న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఆరోజే రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారన్నది అధికారికంగా తేలబోతున్నది.