భార్య వ్యభిచారం.. వద్దన్నందుకు భర్తను చంపేసింది..
Hyderabad | ఆ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. పండంటి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కుటుంబ పోషణ కోసం భర్త ఆటో నడుపుతుండగా, ఇంటి వద్దే ఉన్న భార్య మాత్రం వ్యభిచారం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. వ్యభిచారం మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో తన స్నేహితులతో కలిసి భర్తను భార్య చంపేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం వెలిమల గ్రామానికి చెందిన […]

Hyderabad | ఆ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. పండంటి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కుటుంబ పోషణ కోసం భర్త ఆటో నడుపుతుండగా, ఇంటి వద్దే ఉన్న భార్య మాత్రం వ్యభిచారం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. వ్యభిచారం మానుకోవాలని హెచ్చరించాడు. దీంతో తన స్నేహితులతో కలిసి భర్తను భార్య చంపేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం వెలిమల గ్రామానికి చెందిన సురేశ్.. బతుకు దెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి జీడిమెట్లలోని సంజయ్ గాంధీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. 2016లో రేణుకను సురేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సురేశ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుండగా. రేణుక ఇంటి వద్దే ఉంటోంది.
అయితే ఈ నెల 5వ తేదీన ఫుడ్ పార్శిల్ తీసుకొచ్చేందుకు సురేశ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సురేశ్ మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. అయితే తన ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు గోనె సంచి పడేసి వెళ్లిపోయారు. ఆ సంచిని విప్పి చూడగా, సురేశ్ మృతదేహం లభ్యమైంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రేణుక, పిల్లలు కలిసి ఆటోలో మృతదేహాన్ని జీడిమెట్ల పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. సురేశ్ తలపై గాయాలు ఉండటంతో.. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
అయితే పోస్టుమార్టం నిర్వహించొద్దని, డెడ్‌బాడీని గాంధీకి తరలించొద్దని రేణుక పోలీసులను కోరింది. రేణుక మాటలు వినిపించుకోకుండా, డెడ్‌బాడీని గాంధీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సురేశ్ హత్యకు గురైనట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన స్నేహితుల సాయంతోనే భర్త సురేశ్‌ను మట్టుబెట్టినట్లు పోలీసుల విచారణలో రేణుక అంగీకరించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.