Hyderabad | స్టార్ట‌ప్ కంపెనీల‌కు స్వ‌ర్గ‌ధామం.. బెంగళూరు! హైద‌రాబాద్‌కు దక్కని చోటు

Hyderabad | తదుపరి స్థానాల్లో ఢిల్లీ, ముంబై అంతర్జాతీయ లిస్టులో లభించని చోటు టాప్‌ 5 భారత నగరాల్లో ఆఖరి స్థానం వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ జాబితా విడుదల విధాత‌: న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ కంపెనీల స్థాపనకు అనువైన నగరాల్లో భారత్‌లో బెంగళూరు, ఢిల్లీ, ముంబై చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు ఒక జాబితాను వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ విడుదల చేసింది. అయితే.. ప్రపంచ స్థాయిలో ఎంపిక చేసిన నగరాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. పనితీరు, నిధులు, […]

Hyderabad | స్టార్ట‌ప్ కంపెనీల‌కు స్వ‌ర్గ‌ధామం.. బెంగళూరు! హైద‌రాబాద్‌కు దక్కని చోటు

Hyderabad |

  • తదుపరి స్థానాల్లో ఢిల్లీ, ముంబై
  • అంతర్జాతీయ లిస్టులో లభించని చోటు
  • టాప్‌ 5 భారత నగరాల్లో ఆఖరి స్థానం
  • వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ జాబితా విడుదల

విధాత‌: న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ కంపెనీల స్థాపనకు అనువైన నగరాల్లో భారత్‌లో బెంగళూరు, ఢిల్లీ, ముంబై చోటు దక్కించుకున్నాయి. ఈ మేరకు ఒక జాబితాను వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ విడుదల చేసింది. అయితే.. ప్రపంచ స్థాయిలో ఎంపిక చేసిన నగరాల్లో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు.

పనితీరు, నిధులు, అనుసంధానం, మార్కెట్ చేరువ, జ్ఞానం, ప్రతిభ- అనుభవం వంటి అంశాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో ప్ర‌పంచ దేశాల నుంచి సుమారు 40 న‌గ‌రాల‌కు స్థానం ద‌క్క‌గా, అందులో టాప్‌ పొజిషన్‌లో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కో నిలిచింది. భార‌త‌దేశానికి సంబంధించి బెంగుళూరు 22వ స్థానం దక్కించుకోగా.. ఢిల్లీ 26వ స్థానంలో, ముంబై 39వ స్థానంలో నిలిచాయి.

టాప్‌ 2, 3 స్థానాల్లో న్యూయార్క్‌, లండన్‌ నిలిచాయి. తదుపరి స్థానాల్లో నిలిచిన నగరాలను పరిశీలిస్తే.. 4.బోస్ట‌న్‌, 5.బీజింగ్‌, 6.లాస్ ఏంజెల్స్‌, 7.టెల్ అవివ్‌, 8.షాంఘై, 9.సియాటెల్‌, 10.సియోల్‌, 11.వాషింగ్ట‌న్ డీసీ, 12.టోక్యో, 13.శాన్ డైగో, 14.అమ్మెస్ట‌ర్‌డామ్‌, 15.పారిస్‌, 16.బెర్లిన్‌, 17.టోర్న‌టో, 18.సింగ‌పూర్‌, 19.షికాగో, 20.షిడ్నీ, 21.స్టాక్‌హోం, 22.బెంగ‌ళూరు, 23.షెన్‌జెన్‌, 24.డెన్వ‌ర్‌, 25.ఆస్టిన్‌, 26.ఢిల్లీ, 27.ఫిల‌డెల్ఫియా, 28.షావ్‌పాలో, 29.సాల్ట్‌లేక్‌, 30.వాంకోవ‌ర్‌, 31.అట్లాంటా, 32.కోపెన్ హేగ‌న్‌, 33.డాలస్‌, 34.హ‌ల్సింకి, 35.మియామి, 36.హాంగ్‌జో, 37.మెల్‌బోర్న్‌, 38.మాంట్రియాల్‌, 39.ముంబై, 40. మ్యూనిచ్ ఉన్నాయి.

దేశస్థాయిలో హైద‌రాబాద్‌కు ఐదో ర్యాంకు

హైదరాబాద్‌లో ఐటీ రంగ పురోగతి గురించి ఐటీశాఖ మంత్రి కే. తార‌క‌రామారావు ప‌దే ప‌దే చెబుతుంటారు. కానీ దేశంలో స్టార్టప్‌ కంపెనీలకు అత్యంత అనువైన నగరాలు ఐదు ఉంటే.. అందులో హైదరాబాద్‌ ఐదో స్థానాన్ని దక్కించుకున్నదని కేంద్రమంత్రి చెప్పారు. బెంగుళూరు మొద‌టి స్థానాన్ని కైవ‌సం చేసుకోగా, హైద‌రాబాద్ అట్టడుగు స్థానం అంటే, ఐదో స్థానంలో ఉంది.

భార‌త‌దేశంలో ఇప్పుడు 90 వేల స్టార్ట‌ప్‌లు, 107 యునికార్న్ కంపెనీలు క‌లిసి 30 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన పెట్టుబ‌డులు పెట్టాయి. ప్ర‌పంచదేశాల్లో స్టార్టప్ అనుకూల వాతావ‌ర‌ణం ర్యాంకుల్లో భార‌త్‌ మూడో స్థానంలో ఉన్న‌ట్లు కేంద్ర‌మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్ల‌డించారు. ఆయ‌న వెల్ల‌డించిన అంశాల ఆధారంగా..

1) బెంగళూరు: భారతదేశంలోని సిలికాన్ వ్యాలీ అయిన బెంగళూరు, వాణిజ్యం మరియు డిజిటలైజేషన్‌కు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉన్నందున స్టార్టప్‌లకు నగరం అని కూడా పిలుస్తారు. ఈ నగరాన్ని దేశంలోని ఐటీ హబ్‌గా కూడా పిలుస్తారు. అనేక బెంగళూరు స్టార్టప్‌లలో ఫ్లిప్‌కార్ట్, ఓలా, ఇన్‌మోబి, క్వికర్ మొదలైనవి ఉన్నాయి. బెంగుళూరు న‌గ‌రం ప్ర‌పంచ ర్యాంకు జాబితాలోనూ చోటు సంపాదించింది.

2) ఢిల్లీ: జాతీయ రాజధాని, ప్రధానంగా నోయిడా, గురుగ్రామ్‌లు స్టార్ట‌ప్‌ల‌కు అనుకూలంగా మారాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మైక్రోసాఫ్ట్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఐబిఎంతోపాటు మరెన్నో భారతీయ కార్పొరేట్ కంపెనీలకు నిలయంగా ఉంది. ఇక్క‌డి ప్రసిద్ధ స్టార్టప్‌లలో జొమాటో, ఇన్‌షార్ట్‌లు, స్నాప్‌డీల్ మొదలైనవి ఉన్నాయి. ప్ర‌పంచ‌న‌గ‌రాల జాబితాలో కూడా ఢిల్లీ చోటు సంపాదించుకుంది.

3) ముంబై: ముంబై భారతదేశానికి ఆర్థిక రాజధానిగా, యువ పారిశ్రామిక‌వేత్త‌ల‌ కలలు సాకారమయ్యే ప్రదేశంగా పిలువబడుతుంది ముంబై. ముంబై నగరంలో భారీ సంఖ్యలో ఉపాధి, వ్యాపార అవకాశాలు ఉన్నందున స్టార్టప్ కంపెనీల‌ లక్ష్యాలను సాధించడానికి అనువుగా ఉంటోంది. ఓయో, ఓలా, బుక్‌మై షో వంటి ప్ర‌సిధ్ద స్టార్ట‌ప్‌లు ముంబై కేంద్రంగా మొద‌లైన‌వే.ప్రపంచ ప్ర‌సిద్ధ న‌గ‌రాల జాబితాలో కూడా ముంబై న‌గ‌రం చోటు సంపాదించింది.

4) అహ్మదాబాద్: గుజరాత్ రాజధాని దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా అహ్మ‌దాబాద్ ఉంది. ఎందుకంటే ఇక్క‌డే టెక్స్‌టైల్, కెమికల్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలలో వ్యవస్థాపకతకు బలమైన చరిత్ర ఉంది. అహ్మదాబాద్ భారతదేశంలోని అతిపెద్ద ఫార్మా కంపెనీలకు నిలయం – జైడస్ కాడిలా, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ వంటి స్టార్ట‌ప్‌ల‌కు ఇది కేంద్రంగా ఉంది.

5) హైదరాబాద్: గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, డెల్ మొదలైన అంత‌ర్జాతీయ కంపెనీలకు హైదరాబాద్ నిలయంగా మారింది. హైటెక్ సిటీని భారతదేశ ఐటి హబ్ అని కూడా పిలుస్తారు. తెలంగాణ రాజధాని ఫార్మాస్యూటికల్స్‌కు కేంద్రంగా కూడా మారనుంది. డార్విన్‌బాక్స్, అర్బన్ కిసాన్, మ్యాప్‌మైజెనోమ్ వంటి స్టార్ట‌ప్‌ల‌కు హైద‌రాబాద్ కేంద్రంగా ఉంది.