Hyderabad Metro | ప్రయాణికులపై మెట్రో పిడుగు.. డిస్కౌంట్లు కట్‌

సగానికి సగం రాయితీలు కట్ రేప‌టి నుంచి అమ‌లు సువ‌ర్ణ సేవ‌ర్ ఆఫ‌ర్ ఏప్రిల్ 1 నుంచి రూ. 99 విధాత‌: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్. మెట్రో రైల్ ప్ర‌య‌ణికుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగిస్తున్న రాయితీల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండి కేవీబి రెడ్డి వెల్ల‌డించారు. మెట్రో చార్జీలలో కార్డు మరియు క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసే టికెట్లపై 10 శాతం రాయితీని ఉపసంహరించినట్లు తెలిపారు. అయితే.. […]

Hyderabad Metro | ప్రయాణికులపై మెట్రో పిడుగు.. డిస్కౌంట్లు కట్‌
  • సగానికి సగం రాయితీలు కట్
  • రేప‌టి నుంచి అమ‌లు
  • సువ‌ర్ణ సేవ‌ర్ ఆఫ‌ర్ ఏప్రిల్ 1 నుంచి రూ. 99

విధాత‌: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్. మెట్రో రైల్ ప్ర‌య‌ణికుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగిస్తున్న రాయితీల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండి కేవీబి రెడ్డి వెల్ల‌డించారు. మెట్రో చార్జీలలో కార్డు మరియు క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసే టికెట్లపై 10 శాతం రాయితీని ఉపసంహరించినట్లు తెలిపారు.

అయితే.. రోజులో ఆరు గంటలు మాత్రమే 10% రాయితీ వర్తిస్తుందన్నారు. ఈ రాయితీ ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, సాయంత్రం 8 గంటల నుండి 12 గంటల వరకు మాత్రమే ఉంటుందన్నారు.

గతంలో ఉన్న సువర్ణ సేవర్ ఆఫర్ ఈ నెల 31తో ముగుస్తుందన్నారు. ఇప్పటి వరకు ఈ ఆఫ‌ర్ కింద‌ 59 రూపాయలు తీసుకున్న మెట్రో ఇకపై ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చ్ 31 వరకు 99 రూపాయలుగా ఉంటుంద‌ని తెలిపారు.

అయితే.. ముందుగా సూచించిన సెలవు దినాలలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లైనా మెట్రోలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 4.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారన్నారు. అదేవిధంగా కొత్త స్మార్ట్‌ కార్డు ధరను రూ.50 నుంచి రూ.100కు పెంచారు.