Hyderabad | సీజ్ చేసిన డ్రగ్స్ ఇంటికి.. సైబర్ క్రైం SI రాజేందర్ అరెస్టు

Hyderabad | విధాత : డ్రగ్స్ కేసులో సైబర్ క్రైం ఎస్‌ఐ రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. గతంలో డ్రగ్ కేసులో నిందితుల నుంచి పట్టుబడిన ఎండీఎంఎస్ డ్రగ్స్ నుంచి కొంత రహస్యంగా ఇంటికి తరలించిన ఎస్‌ఐ వాటిని సమయం చూసి విక్రయించే ప్రయత్నంలో ఉన్నాడు. సీజ్ చేసిన డ్రగ్‌లో కొంత తక్కువగా ఉండటంతో దర్యాప్తు చేసిన అధికారులు ఎస్సై నిర్వాకాన్ని గుర్తించారు. వెంటనే అతడి ఇంటిపై దాడి చేసిన నార్కోటింగ్ వింగ్ అధికారులు […]

  • By: krs    latest    Aug 27, 2023 11:38 AM IST
Hyderabad | సీజ్ చేసిన డ్రగ్స్ ఇంటికి.. సైబర్ క్రైం SI రాజేందర్ అరెస్టు

Hyderabad |

విధాత : డ్రగ్స్ కేసులో సైబర్ క్రైం ఎస్‌ఐ రాజేందర్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. గతంలో డ్రగ్ కేసులో నిందితుల నుంచి పట్టుబడిన ఎండీఎంఎస్ డ్రగ్స్ నుంచి కొంత రహస్యంగా ఇంటికి తరలించిన ఎస్‌ఐ వాటిని సమయం చూసి విక్రయించే ప్రయత్నంలో ఉన్నాడు.

సీజ్ చేసిన డ్రగ్‌లో కొంత తక్కువగా ఉండటంతో దర్యాప్తు చేసిన అధికారులు ఎస్సై నిర్వాకాన్ని గుర్తించారు. వెంటనే అతడి ఇంటిపై దాడి చేసిన నార్కోటింగ్ వింగ్ అధికారులు ఎండీఎంఏ డ్రగ్‌తో పాటు కొంత నగదును స్వాదీనం చేసుకున్నారు. ఎస్‌ఐ రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.

కాగా రాజేందర్ గతంలో రాయదుర్గం, మాదాపూర్ పోలీస్ స్టేషన్లలో పనిచేసిన సందర్భంలో లంచం కేసులో రాజేందర్‌ ఏసీబీకి పట్టుబడగా, విచారణ చేసిన కోర్టు అతడిని సర్వీస్ నుంచి తొలగించింది. పై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని ఉద్యోగంలో చేరిన రాజేందర్ డ్రగ్ కేసులో అరెస్టు కావడం గమనార్హం.