హైద్రాబాద్ సన్ బర్న్ షో రద్దు

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మాదాపూర్ లో నిర్వహించ తలపెట్టిన సన్ బర్న్ సంగీత వేడుక కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు

హైద్రాబాద్ సన్ బర్న్ షో రద్దు

విధాత : నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మాదాపూర్ లో నిర్వహించ తలపెట్టిన సన్ బర్న్ సంగీత వేడుక కార్యక్రమాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఈవెంట్ కి సంబంధించి బుక్ మై షో లో టికెట్ల విక్రయాన్ని కూడా నిలిపివేశారు. ఈవెంట్ నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోకకపోవడం, బుక్ మై షోలో టికెట్లు విడుదల చేసిన నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీల కాన్ఫరెన్స్‌లో సీరియస్ అయ్యారు.


దీనిపై వెంటనే పోలీసులు విచారణ చేసి నిర్వాహకులను మందలించారు. అనుమతి తీసుకోకుండా ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసిన నిర్వాహకుడు సుమంత్ పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుక్ మై షోకు, నోడల్ అధికారులకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం బుక్ మై షో లో సన్ బర్న్ షో హైదరాబాద్ ఈవెంట్ టికెట్ల జారీ నిలిచిపోగా, విశాఖ వేదికగా జరగబోయే సన్ బర్న్‌ ఈవెంట్ టికెట్లు మాత్రం అమ్ముడుపోతున్నాయి.


సన్ బర్న్ షో సంగీత కార్యక్రమం ముసుగులో మద్యం అనుమతించడంతో పాటు అనధికారికంగా డ్రగ్స్ వినియోగం, అసాంఘీక కార్యకలాపాలు సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఈ షోపై ఫోకస్ పెట్టిన నేపధ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడం, సన్ బర్న్ షో రద్దు కావడం గమనార్హం