TSPSC | గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలి.. హైకోర్టులో మరో పిటీషన్
TSPSC హైదరాబాద్, విధాత: గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ముగ్గురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి, పిటీషన్ దాఖలుచేశారు. కొంతమంది అభ్యర్థుల బయోమెట్రిక్, హాల్‌టికెట్, ఫొటో లేకుండానే అభ్యర్థులకు ఓఎమ్ఆర్ (OMR) షీట్లు అందజేశారని వారు పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించినప్పటికీ టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం కారణంగా జూన్ 11న తిరిగి మళ్లీ నిర్వహించారు. […]

TSPSC
హైదరాబాద్, విధాత: గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది. జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని కోరుతూ ముగ్గురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి, పిటీషన్ దాఖలుచేశారు.
కొంతమంది అభ్యర్థుల బయోమెట్రిక్, హాల్‌టికెట్, ఫొటో లేకుండానే అభ్యర్థులకు ఓఎమ్ఆర్ (OMR) షీట్లు అందజేశారని వారు పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించినప్పటికీ టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం కారణంగా జూన్ 11న తిరిగి మళ్లీ నిర్వహించారు.
భారీ పోలీస్ బందోబస్తు నడుమ పరీక్ష నిర్వహించినా పరీక్ష కేంద్రాల్లో మాత్రం అభ్యర్థులకు బయోమెట్రిక్, హాల్‌టికెట్లు, ఫొటో లేకుండానే వారికి ఓఎమ్ఆర్ షీట్లు అందజేశారన్నారు. దీంతో చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, దయచేసి దీనిపై విచారణ చేపట్టి తమలాగా గ్రూప్-1 పరీక్ష రాసిన ఎంతోమంది అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు పిటీషన్‌లో పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే తెలంగాణ హైకొర్టు విచారణ చేపట్టనుంది.