కళాశాల విద్యలో ఆర్జేడీ పోస్టులు రద్దు.

విధాత,అమరావతి: కళాశాల విద్యలో ప్రాంతీయ సంయుక్త సంచాలకుల(ఆర్జేడీ) పోస్టులు రద్దు కానున్నాయి. వీరికి సంబంధించిన అధికారాలను సంయుక్త కలెక్టర్లకు బదలాయించనున్నారు. డిగ్రీ కళాశాలల పర్యవేక్షణ, తనిఖీ బాధ్యతలను జేసీలకు అప్పగించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం కడప ఆర్జేడీ పరిధిలో రాయలసీమ నాలుగు జిల్లాలు ఉండగా.. గుంటూరు ఆర్జేడీ పరిధిలో నెల్లూరు, గుంటూరు, ప్రకాశం ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు రాజమహేంద్రవరం ఆర్జేడీ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం […]

కళాశాల విద్యలో ఆర్జేడీ పోస్టులు రద్దు.

విధాత,అమరావతి: కళాశాల విద్యలో ప్రాంతీయ సంయుక్త సంచాలకుల(ఆర్జేడీ) పోస్టులు రద్దు కానున్నాయి. వీరికి సంబంధించిన అధికారాలను సంయుక్త కలెక్టర్లకు బదలాయించనున్నారు. డిగ్రీ కళాశాలల పర్యవేక్షణ, తనిఖీ బాధ్యతలను జేసీలకు అప్పగించనున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రస్తుతం కడప ఆర్జేడీ పరిధిలో రాయలసీమ నాలుగు జిల్లాలు ఉండగా.. గుంటూరు ఆర్జేడీ పరిధిలో నెల్లూరు, గుంటూరు, ప్రకాశం ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు రాజమహేంద్రవరం ఆర్జేడీ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని చోట్ల కళాశాలల ప్రిన్సిపాళ్లే ఇన్‌ఛార్జి ఆర్జేడీలుగా కొనసాగుతున్నారు. ఈ పోస్టులు రద్దు చేసి, వీరిని ప్రిన్సిపాళ్లుగా కళాశాలలకు పంపనున్నారు.
కొత్తగా 93 జూనియర్‌ కళాశాలలు
రాష్ట్ర వ్యాప్తంగా 93 మండలాల్లో కొత్తగా జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఎక్కువగా ఉన్న, మౌలికసదుపాయాలున్న ఉన్నత పాఠశాలలను గుర్తించాలని జిల్లా వృత్తివిద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి మండలానికో జూనియర్‌ కళాశాల, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండోది ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో పాఠశాలలను గుర్తించే చర్యలు చేపట్టారు.