Hydrabad | నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Hydrabad రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా లోకేష్‌ కుమార్‌ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా రోనాల్డ్‌ రోస్‌ విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: రాష్ట్రంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను తెలంగాణ ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న లోకేష్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న డి.రోనాల్డ్‌ రోస్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించారు. ఎక్సైజ్‌ […]

Hydrabad | నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Hydrabad

  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా లోకేష్‌ కుమార్‌
  • జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా రోనాల్డ్‌ రోస్‌

విధాత, హైదరాబాద్‌ ప్రతినిధి: రాష్ట్రంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను తెలంగాణ ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న లోకేష్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించారు.

రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న డి.రోనాల్డ్‌ రోస్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా నియమించారు. ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉన్న సర్ఫరాజ్‌ అహ్మద్‌ను సంయుక్త ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించారు.

ఇప్పటి వరకు సంయుక్త ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి రవికిరణ్‌ను రిలీవ్‌ చేశారు. వెయిటింగ్‌లో ఉన మహ్మద్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖ్‌ను ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా నియమించారు.