Puri Jagannadh | డ్రగ్స్ అలవాటు లేదు కానీ.. ప్రతి రాత్రి అది కావాల్సిందే: పూరీ జగన్
Puri Jagannadh | మనిషిని లొంగదీసుకునే చెడు అలవాట్లను ఎవరూ అంత త్వరగా బయటి ప్రపంచానికి చెప్పుకోరు. అలా చెబితే పరువు పోతుందునుకునేవాళ్ళు కొందరైతే.. చెపితే లోకువగా చూస్తారని భావించేవాళ్ళూ చాలామందే ఉంటారు. ముఖ్యంగా సినీ జనాలు తమ చెడు అలవాట్లను గురించి మాత్రం అస్సలు బయటపెట్టరు. మీడియా కోడై కూసినా అబ్బే అదేం లేదు.. అవన్నీ రూమర్స్ అనిమాత్రం అనేసి తప్పించుకుంటూ ఉంటారు. అయితే తనలోని చెడును పదిమందిలోనూ చెప్పుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. […]
Puri Jagannadh |
మనిషిని లొంగదీసుకునే చెడు అలవాట్లను ఎవరూ అంత త్వరగా బయటి ప్రపంచానికి చెప్పుకోరు. అలా చెబితే పరువు పోతుందునుకునేవాళ్ళు కొందరైతే.. చెపితే లోకువగా చూస్తారని భావించేవాళ్ళూ చాలామందే ఉంటారు. ముఖ్యంగా సినీ జనాలు తమ చెడు అలవాట్లను గురించి మాత్రం అస్సలు బయటపెట్టరు. మీడియా కోడై కూసినా అబ్బే అదేం లేదు.. అవన్నీ రూమర్స్ అనిమాత్రం అనేసి తప్పించుకుంటూ ఉంటారు.
అయితే తనలోని చెడును పదిమందిలోనూ చెప్పుకోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అలాంటి డేరింగ్ పర్సన్స్ సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉన్నారు. ముఖ్యంగా ఆ కోవలోకి వచ్చేవారిలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి పూరి జగన్నాధ్. అతగాడి మాటల్లానే సినిమాలు కూడా అదే రేంజ్‌లో తనదైన స్టైల్‌లో ఉంటాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి నేటి తరం కుర్ర హీరో రామ్ వరకూ దాదాపు అందరితోనూ సినిమాలు చేసి తన టాలెంట్ చూపించిన గొప్ప డైరెక్టర్ పూరి. అలాగే తనకు నచ్చిన ఫిలాసఫీని నలుగురికీ అర్థమయ్యే రీతిలో చెబుతూ మోటివేట్ చేస్తూ ఆర్‌జీవీ శిష్యుడు అనిపించుకున్నాడు పూరి.
ఇక ఈమధ్య కాలంలో తనలోని చెడు అలవాటును బహిరంగంగా చెప్పేసి ఎప్పటిలానే తను అందరిలాంటి వ్యక్తి కాదని, సంథింగ్ స్పెషల్ అని నిరూపించుకున్నాడు. సినిమాల పరంగా ప్రస్తుతం ప్లాపుల పర్వం నడుస్తున్నా.. త్వరలో రాబోతున్న ఇస్మార్ట్ శంకర్ 2గా రాబోతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ పైనే ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాడు.
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన అలవాట్ల గురించి అడిగినప్పుడు మీకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందట కదా.. నిజంగానే తీసుకుంటారా అని అడిగితే.. దానికి పూరి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. డ్రగ్స్ అలవాటు లేదుగానీ మందు మాత్రం డైలీ రాత్రి తీసుకోనిదే నిద్ర పట్టదని కుండ బద్దలు కొట్టేశాడు.
‘ఈ అలవాటు ఆర్‌జీవీ నుంచి వచ్చింది. కాకపోతే గత మూడేళ్ళుగా ప్రతి రాత్రి ఆల్కహాల్ తీసుకోనిదే నిద్రపోవడంలేదు. ఎంత మానేద్దాం అని అనుకుంటున్నా ఈ అలవాటు నన్ను వదలడం లేదు.. మానేయాలనే చాలా ట్రై చేస్తున్నాను’’ అని చాలా ఓపెన్‌గా చెప్పేశాడీ డేరింగ్ డైరెక్టర్.
మందు గురించి పూరీ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరీ మాటలను విన్నవారంతా.. ఎంతైనా ఇలాంటి లోపాలను బయట పెట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ విషయంలో పూరి జగన్నాధ్ ఓ మెట్టు పైనే ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
X


Google News
Facebook
Instagram
Youtube
Telegram