vara lakshmi ఒక రెండు మూడు తరాల ముందు బేబీ వరలక్ష్మి లేదా నటి వరలక్ష్మి అంటే అందరికీ బాగా గుర్తుండేది. దాదాపు మూడు దశాబ్దాల కాలం పాటు ఆమె నటిగా కొనసాగింది. ముఖ్యంగా చెల్లి పాత్రలు, అమాయకంగా ఉంటూ మోసపోయే పాత్రలు, రేప్‌లకు గురయ్యే పాత్రల్లోనే కొన్ని వందల చిత్రాలలో తనదైన నటనతో మెప్పించింది. ఈమెను అంతా బేబీ వరలక్ష్మి అని సీనియర్ నటి వరలక్ష్మి అని అంటారు. ఈమె ఫేస్ అమాయకంగా కనిపిస్తుంది కాబట్టి […]
vara lakshmi
ఒక రెండు మూడు తరాల ముందు బేబీ వరలక్ష్మి లేదా నటి వరలక్ష్మి అంటే అందరికీ బాగా గుర్తుండేది. దాదాపు మూడు దశాబ్దాల కాలం పాటు ఆమె నటిగా కొనసాగింది. ముఖ్యంగా చెల్లి పాత్రలు, అమాయకంగా ఉంటూ మోసపోయే పాత్రలు, రేప్‌లకు గురయ్యే పాత్రల్లోనే కొన్ని వందల చిత్రాలలో తనదైన నటనతో మెప్పించింది. ఈమెను అంతా బేబీ వరలక్ష్మి అని సీనియర్ నటి వరలక్ష్మి అని అంటారు. ఈమె ఫేస్ అమాయకంగా కనిపిస్తుంది కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ఆమెకు ఎక్కువగా ఇలాంటి పాత్రలు ఇచ్చేవారు అని ఆమెకు చెప్పుకొచ్చింది.
ఇటీవల ఆమె ఇంటర్వ్యూలో భాగంగా తనకు సంబంధించిన విషయాలపై స్పందించింది. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చిన ఆమె గత ఏడాది చివర్లో సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు చాలా ఏడ్చాను నన్ను అందరూ సిస్టర్ వరలక్ష్మి లేదా బేబీ వరలక్ష్మి అనే పిలిస్తే పలుకుతాను కానీ రేప్ వరలక్ష్మి అని పిలిస్తే చాలా బాధపడతానని తెలిపింది.
ఆనాడు నాతోటి నటీనటులు కూడా కొంతమంది రేప్‌ల వరలక్ష్మి అని పిలిచేవారు. అది నాకు అసలు నచ్చేది కాదు. నేను ఇక్కడ హీరోయిన్గా సినిమాలు చేయకపోయినా వారి రేంజిలో అయితే పారితోషకం అందుకున్నానని చెన్నైలో నాకు కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని చాలామంది చెప్పుకునేవారు. కానీ అందులో నిజం లేదు.
నేను చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పుడు కూడా చాలా తక్కువ పారితోష్ణమిచ్చే వారు. అందరికంటే ఎక్కువ పారితోషం తీసుకున్నది శాలిని మాత్రమే. మా నాన్న మా స్కూల్ ఫీజు కట్టడానికి చాలా ఇబ్బందులు పడేవారు. తర్వాత సినిమాలలో చెల్లెలి పాత్రలో చేయడం మొదలు పెట్టిన తర్వాత మంచి పారితోషికాలు అందుకున్నాను. కానీ నాకు కోట్ల విలువ చేసే ఆస్తులు అయితే లేవు. ఇప్పటికైతే మాకు కలిగిన దానితో మేము సంతోషంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి.