కేంద్ర సర్వీస్ లోకి స్మితా సబర్వాల్ దరఖాస్తు!

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీస్‌లోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. ఆమె గత ప్రభుత్వంలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నారు.

  • By: Somu    latest    Dec 13, 2023 10:05 AM IST
కేంద్ర సర్వీస్ లోకి స్మితా సబర్వాల్ దరఖాస్తు!

విధాత : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులలోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తున్నది. ఆమె గత ప్రభుత్వంలో సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ పనులను ఆమె పర్యవేక్షించారు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు.


కొత్త చాలెంజ్‌లకు ఎప్పుడూ సిద్ధమంటూ.. ఆమె చేసిన ట్వీట్‌ ఆసక్తిని రేపుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీస్‌ను గుర్తు చేసుకుంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆమె భర్త ఐపీఎస్ అకున్ సబర్వాల్ ఇప్పటికే కేంద్ర సర్వీసులలో ఉన్నారు. కాగా రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత నేపథ్యంలో స్మితా సబర్వాల్‌ను ప్రభుత్వం రిలీవ్ చేస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.


గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన స్మితా సబర్వాల్‌ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దూరం పాటిస్తున్నారు. మిగతా ఐఏఎస్ అధికారులు సీఎంను, మంత్రులను కలుస్తున్నప్పటికీ ఆమె మాత్రం అందుకు దూరంగా ఉన్నారు. మరోవైపు బీఆరెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసులలోకి వెళ్లిపోయిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ఇప్పుడు రాష్ట్ర సర్వీస్‌లోకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు.