Pawan Kalyan | వలంటీర్లు.. సంఘవిద్రోహ శక్తులు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan | ఏలూరు సభలో పవన్ మాటల దాడి ఆంధ్రాలో వలంటీర్ల ధర్నా విధాత‌: ఓ వారం గ్యాప్ తరువాత మళ్ళీ ఆంధ్రకు వచ్చిన పవన్ కళ్యాణ్ మళ్ళొకసారి నిప్పు రాజేశారు. గతంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర వైసిపి నాయకులను సంకెళ్లు వేసి కొట్టుకుంటూ తీసుకువెళ్తామని చెప్పిన పవన్ ఈసారి ఏలూరు సభలో గ్రామ వాలంటీర్ల మీద దాడి చేశారు. ఇది కాస్తా ఇప్పుడు ఆంధ్రాలో అగ్గి రాజుకున్నట్లు అయింది. పవన్ మీద […]

  • By: Somu    latest    Jul 10, 2023 10:23 AM IST
Pawan Kalyan | వలంటీర్లు.. సంఘవిద్రోహ శక్తులు: పవన్ కళ్యాణ్

Pawan Kalyan |

  • ఏలూరు సభలో పవన్ మాటల దాడి
  • ఆంధ్రాలో వలంటీర్ల ధర్నా

విధాత‌: ఓ వారం గ్యాప్ తరువాత మళ్ళీ ఆంధ్రకు వచ్చిన పవన్ కళ్యాణ్ మళ్ళొకసారి నిప్పు రాజేశారు. గతంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇతర వైసిపి నాయకులను సంకెళ్లు వేసి కొట్టుకుంటూ తీసుకువెళ్తామని చెప్పిన పవన్ ఈసారి ఏలూరు సభలో గ్రామ వాలంటీర్ల మీద దాడి చేశారు. ఇది కాస్తా ఇప్పుడు ఆంధ్రాలో అగ్గి రాజుకున్నట్లు అయింది. పవన్ మీద లక్షలాది మంది వార్డు.. గ్రామ వలంటీర్లు విమర్శలు, ధర్నాలు.. నిరసనలతో హోరెత్తిస్తున్నారు.

వాస్తవానికి నిన్న రాత్రి పవన్ ఏలూరులో మాట్లాడుతూ.. ఆంధ్రాలో వలంటీర్లు అమ్మాయిలను ట్రాప్ చేస్తూ.. అమ్మాయిల సమాచారం. గ్రామాల్లోని వితంతువుల సమాచారాన్ని వేరే వాళ్లకు ఇస్తున్నారని, వారు ఈ వర్గాలను టార్గెట్ చేసి ఎత్తుకు పోతున్నారు అని, ఇలా ఆంధ్రాలో 17 వేలమంది మహిళలు అదృశ్యమైనట్లు తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని అన్నారు. అంతే కాకుండా తన కుటుంబం మీద.. తనకు లేని భార్య మీద కూడా వైసీపీ దాడి చేస్తోందని ఆరోపించారు.

ఈ కామెంట్స్ రాష్ట్రంలోని లక్షలాది వాలంటీర్లలో ఆగ్రహానికి కారణమైనాయి. వాళ్ళు ఇప్పుడు ఏకంగా వీధుల్లో ధర్నాలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వైసిపి నాయకులూ.. మంత్రులు పవన్ కు వ్యతిరేకంగా ప్రేస్మీట్లల్లో ఎదురుదాడి చేస్తుండగా అటు వలంటీర్లు సైతం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు . ఇటు మంత్రులు గుడివాడ అమర్ తదితరులు పవన్ మీద విమర్శలు చేస్తున్నారు.

ఆడపిల్లల భద్రత గురించి మీరు మాట్లాడడం దారుణం.. నలుగురు పిల్లలను చేసుకుని .. ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆటలాడిన పవన్ ఇప్పుడు మహిళల భద్రత గురించి స్పీచ్ ఇవ్వడం అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొట్టడం అంటూ గుడివాడ అమర్ రివర్స్ పంచ్ ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో లక్షలాది మంది వలంటీర్లు సైతం పవన్ తమకు సారీ చెప్పాలని, తమ ఆత్మగౌరవాన్ని అయన దెబ్బ తీశారని ఆరోపిస్తూ ఆందోళన చేస్తున్నారు.