Karimnagar: అవినీతి కేసులో రెవెన్యూ ఉద్యోగికి జరిమానా జైలు శిక్ష
విధాత బ్యూరో, కరీంనగర్: అవినీతి కేసులో రెవెన్యూ ఉద్యోగికి శిక్ష విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. సదరు ఉద్యోగికి 20వేల జరిమానాలతో పాటు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కు చెందిన పెండ్యాల మహిపాల్ రెడ్డి తనకు చెందిన వ్యవసాయ భూమిని తన భార్య పేరిట పట్టా మార్పిడి చేయించేందుకు వీఆర్వో వెంకటరమణను ఆశ్రయించారు. అందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు. లంచం డబ్బు ఇచ్చుకోలేని మహిపాల్ రెడ్డి […]
విధాత బ్యూరో, కరీంనగర్: అవినీతి కేసులో రెవెన్యూ ఉద్యోగికి శిక్ష విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. సదరు ఉద్యోగికి 20వేల జరిమానాలతో పాటు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కు చెందిన పెండ్యాల మహిపాల్ రెడ్డి తనకు చెందిన వ్యవసాయ భూమిని తన భార్య పేరిట పట్టా మార్పిడి చేయించేందుకు వీఆర్వో వెంకటరమణను ఆశ్రయించారు. అందుకు ఆయన లంచం డిమాండ్ చేశారు. లంచం డబ్బు ఇచ్చుకోలేని మహిపాల్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించగా, మహిపాల్ రెడ్డి నుండి 500 లంచం తీసుకుంటున్న వెంకటరమణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కేసు పూర్వపరాలు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు పరిగణలోకి తీసుకున్న కోర్టు బుధవారం పై విధంగా తీర్పునిచ్చింది. వెంకటరమణ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram