AP | ఇయర్ ఫోన్స్ పెట్టుకుని.. డ్రైవింగ్ చేస్తే రూ. 20,000 జరిమానా

AP ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం. విధాత, డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల నుంచి ఈ జరిమానా నిబంధన అమలు కానుంది. ఇకపై బైక్ మీద , కారులో, ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ , హెడ్సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా వేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా […]

  • By: Somu    latest    Jul 26, 2023 10:18 AM IST
AP | ఇయర్ ఫోన్స్ పెట్టుకుని.. డ్రైవింగ్ చేస్తే రూ. 20,000 జరిమానా

AP

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.

విధాత, డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెల నుంచి ఈ జరిమానా నిబంధన అమలు కానుంది.

ఇకపై బైక్ మీద , కారులో, ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్ , హెడ్సెట్ పెట్టుకుంటే 20,000 జరిమానా వేయనుంది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వాహనదారులు మండి పడుతున్నారు.

ప్రధానంగా ప్రభుత్వ నిర్ణయం ఆన్ లైన్ అర్డర్లతో బైక్ లపై ఇంటింటికి ఫుడ్ సహా ఇతర వస్తువులు సరఫరా చేసే జోమాటా, స్విగ్గీ, ఆమెజాన్, ఫ్లికార్టు వంటి సంస్థల డెలివర్ బాయ్ లు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే రవాణా శాఖాధికారులు తమకు అలాంటి అదేశాలు ఇంకా రాలేదని చెబుతున్నారు