Medak | కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు
సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకునే యత్నం కాంగ్రెస్, బీజేపీ నాయకుల అరెస్టు Medak | విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బుధవారం ఉద్రిక్తత నెలకుంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సీఎం పర్యటనను అడ్డుకునే యత్నం చేశారు. జిల్లావ్యాప్తగా కాంగ్రెస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ లకు తరలించారు. డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీస్ లు అడ్డుకొని, […]

- సీఎం కేసీఆర్ పర్యటనను అడ్డుకునే యత్నం
- కాంగ్రెస్, బీజేపీ నాయకుల అరెస్టు
Medak | విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బుధవారం ఉద్రిక్తత నెలకుంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సీఎం పర్యటనను అడ్డుకునే యత్నం చేశారు. జిల్లావ్యాప్తగా కాంగ్రెస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ లకు తరలించారు.
డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. పోలీస్ లు అడ్డుకొని, నిరసనకారులను వెల్దుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు. డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పోలీసుల తీరును ఖండించారు.
అరెస్ట్ లు అప్రజాస్వామికమని అన్నారు. సీఎం కేసీఆర్ పర్యటనలో సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వస్తున్న తమను పోలీస్ లు అరెస్ట్ చేయడం తగదన్నారు. జిల్లావ్యాప్తంగా అరెస్టయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ను వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు.
అరెస్ట్ అయినవారిలో డీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డి, పీసీసీ నాయకులు మామిండ్ల ఆంజనేయులు, బీసీ సెల్ అధ్యక్షుడు పల్లె రాంచందర్ గౌడ్, కీల శంకర్, వెంకట్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్యామ్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డితో పాటు పీసీసీ, డీసీసీ, మండల పార్టీ నాయకులు ఉన్నారు. వారిని అర్ధరాత్రి పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.
సీఎం కేసీఆర్ మెదక్ రాకను అడ్డుకుంటామని ప్రకటించిన బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీస్ లు అడ్డుకొని, పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ జిల్లా నేతలు నందరెడ్డి, రాజేందర్ తో పాటు వందలాది మంది కార్యకర్తలను పోలీస్ లు అదుపు లోకి తీసుకున్నారు. నిరసనకారులు ప్లకార్డులతో రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీస్ లు అరెస్ట్ చేశారు. దీంతో మెదక్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.