పెద్దపల్లికి మెగాస్టార్ చిరంజీవి.. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం
హాజరుకానున్న పలువురు రాజకీయ ప్రముఖులు విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి తన తండ్రి పరికిపండ్ల సత్యనారాయణ స్మారకార్థం స్వగ్రామమైన పాలకుర్తి మండలం బసంతనగర్ లో కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 'పరికిపండ్ల సత్యనారాయణ మెమోరియల్ శంకర్ విజన్ సెంటర్' పేరిట ఆయన ఏర్పాటు చేయ తలపెట్టిన కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. […]

- హాజరుకానున్న పలువురు రాజకీయ ప్రముఖులు
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి తన తండ్రి పరికిపండ్ల సత్యనారాయణ స్మారకార్థం స్వగ్రామమైన పాలకుర్తి మండలం బసంతనగర్ లో కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
‘పరికిపండ్ల సత్యనారాయణ మెమోరియల్ శంకర్ విజన్ సెంటర్’ పేరిట ఆయన ఏర్పాటు చేయ తలపెట్టిన కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సోమవారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్, మెగాస్టార్ చిరంజీవి, బిజెపి జాతీయ నాయకుడు కె లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు టి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, విజయశాంతి, సోమారపు సత్యనారాయణ, జితేందర్ రెడ్డి, సినీ నటుడు అలీ తదితరులు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు మంగ్లీ, వేణు యెల్దండి, దీకొండ శిరీష, కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, పులికొండ ప్రియదర్శి, గడ్డం రమేష్, దాసలక్ష్మి తదితరుల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ‘ఆలయ ఫౌండేషన్’ స్థాపించి పేదలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పిస్తూ సమాజానికి ఎనలేని సేవ చేస్తున్నారు. వికలాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి పరికరాలను అందించడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు.