Ind vs Wi | నాలుగో టీ20లో గిల్‌పై వేటు.. వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం..!
Ind vs Wi | ప్రస్తుతం వెస్టిండీస్- భారత్ టీ20 మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. విండీస్ జట్టు రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా, భారత్ ఒక్క విజయం దక్కించుకుంది. అయితే ఈ రోజు జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీసును 2-2తో సమయం చేయాలని భారత్ తహతహలాడుతుం ది. ఈ రోజు మ్యాచ్ గెలిస్తే చివరి మ్యాచ్ ఉత్కంఠగా మారడం ఖాయం. మరోవైపు విండీస్ నాలుగో టీ20లో గెలిచి సిరీస్ గెలవాలనే కసితో […]

Ind vs Wi |
ప్రస్తుతం వెస్టిండీస్- భారత్ టీ20 మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. విండీస్ జట్టు రెండు మ్యాచ్‌లలో విజయం సాధించగా, భారత్ ఒక్క విజయం దక్కించుకుంది. అయితే ఈ రోజు జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీసును 2-2తో సమయం చేయాలని భారత్ తహతహలాడుతుం ది. ఈ రోజు మ్యాచ్ గెలిస్తే చివరి మ్యాచ్ ఉత్కంఠగా మారడం ఖాయం.
మరోవైపు విండీస్ నాలుగో టీ20లో గెలిచి సిరీస్ గెలవాలనే కసితో ఉంది. అయితే ఇప్పటి వరకు కరీబియన్‌లోని స్లో పిచ్‌లపై ఆడిన భారత్.. ఫ్లోరిడాలో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో భారత్ ఇక్కడ ఆరు మ్యాచ్‌లు ఆడగా, అందులో నాలుగు గెలిచి ఒక దాంట్లో ఓడింది.మరొకటి వర్షం వలన రద్ధైంది.
ఈ రోజు మ్యాచ్‌లో భారత్ ఎలా ఆడుతుందనే ఆసక్తి అందరిలో ఉండగా, నేటి మ్యాచ్‌కి వాతావరణం అడ్డంకిగా మారుతుందని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ స్పందిస్తూ.. మ్యాచ్ జరిగే ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉండి, చిరుజల్లులు పడతాయే తప్ప రద్దయ్యే విధంగా వర్షం పడదని చెప్పుకొచ్చింది.
ఉష్ణోగ్రత 32-34 సెల్సియస్ ఉండే అవకాశం ఉంది. ఇక గాలిలో తేమ 70 శాతం ఉండటంతో ఉక్కపోత కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మూడు రోజుల విరామం అనంతరం శనివారం ఫ్లోరిడా వేదికగా జరగబోయే నాలుగో టీ20లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది.
మూడో టీ20లో ఏకైక మార్పుతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో టీ20లో కొన్ని మార్పులు చేయాలని అనుకుంటుందట. వెస్టిండీస్ సిరీస్ అంతా విఫలమైన టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌పై వేటు వేసి ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మూడో టీ20లో తొలి అవకాశం అందుకున్న యశస్వీ జైస్వాల్ తక్కువ స్కోరుకే వెనుదిరిగిన కూడా ఆయనకి మరో అవకాశం ఇవ్వాలని టీమిండియా భావిస్తుంది.
ఇషాన్ వస్తే ఇద్దరు లెఫ్ట్ హ్యాండెర్స్ అని భావిస్తే సూర్య కుమార్ యాదవ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇక పిచ్ కండీషన్స్ బట్టి చాహల్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్‌లో ఒకరు ఛాన్స్ అందుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైతే సిరీస్ అవకాశాలు గల్లంతు కానున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ టీమిండియాకి కీలకంగా మారనుంది.