వైల్డ్‌లైఫ్ స‌ఫారీలో టీమ్ ఇండియా

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమ్ ఇండియా మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టుకు రెడీ అవుతున్న‌ది

వైల్డ్‌లైఫ్ స‌ఫారీలో టీమ్ ఇండియా

దక్షిణాఫ్రికాలో బాక్సింగ్ డే టెస్టుకు

ముందు చిల్ అవుతున్న టీమ్ స‌భ్యులు


విధాత‌: ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమ్ ఇండియా మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టుకు రెడీ అవుతున్న‌ది. టెస్టుకు ముందు కొంద‌రు టీమ్ స‌భ్యులు, కోచ్‌లు విహార యాత్ర‌కు వెళ్లి చిల్ అయ్యారు. భారత క్రికెట్ జట్టులోని కొంతమంది సభ్యులు, కోచ్‌లు ఆదివారం సెంచురియ‌న్‌లోని వన్యప్రాణుల సఫారీకి వెళ్లారు. అడ‌వీ జంతుల‌తో క‌లిసి దిగిన ఫొటోల‌ను వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.


యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ సఫారీ సమయంలో చూసిన సింహం, ఖడ్గమృగం వంటి అడవి జంతువుల ఫొటోలను షేర్ చేశారు. ఒక ఫోటోలో, అత‌డు భారత కోచ్‌లతో కలిసి కనిపించాడు. రాహుల్ ద్రవిడ్, పరాస్ మాంబ్రే, విక్రమ్ రాథోర్ త్రయం, ఒక పెద్ద ఖడ్గమృగంతో క‌నిపించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియ‌ర్లు ప్రపంచ కప్ తర్వాత మొదటిసారిగా ఈ టెస్ట్ ఆడ‌బోతున్నారు.