Asia Cup 2025| ఆసియా కప్‌… భారత జట్టు ఇదే

Asia Cup 2025| ఆసియా కప్‌… భారత జట్టు ఇదే

Asia Cup 2025 | యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 9 నుంచి 28 వరకు జరుగనున్న ఆసియా కప్‌ కు 15మందితో కూడిన భారత క్రికెట్ జట్టును బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ మంగళవారం ప్రకటించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌ , వరుణ్‌ చక్రవర్తి, కులదీప్‌ యాదవ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హర్షిత్‌ రాణా, రింకుసింగ్‌ లు ఎంపికయ్యారు.

రిజర్వు ప్లేయర్లుగా ప్రసిద్‌ కృష్ణ, వాషింగ్టన్‌ సుందర్‌, రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌, యశస్వి జైస్వాల్‌ ను ఎంపిక చేశారు . ఐపీఎల్ లో అదరగొట్టిన టీమిండియా స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, యశస్వీ జైస్వాల్ లకు 15మంది జట్టులో చోటు దక్కలేదు.