Modi | భారత్‌ను.. టాప్ 3 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో చేరుస్తా: మోదీ
Modi నా మూడో టెర్మ్‌లో ఆ దిశగానే కృషి ఇది దేశానికి నేను ఇస్తున్న హామీ ఐఈసీసీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మోదీ న్యూఢిల్లీ: తన మూడో టర్మ్‌లో భారతదేశాన్ని ప్రపంచంలోనే టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో చేరుస్తానని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. పునరుద్ధరించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) కాంప్లెక్స్‌ను ప్రధాని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి ప్రయాణం ఆగేది కాదని అన్నారు. ‘ట్రాక్ రికార్డును బట్టి పరిశీలిస్తే.. […]

Modi
- నా మూడో టెర్మ్‌లో ఆ దిశగానే కృషి
- ఇది దేశానికి నేను ఇస్తున్న హామీ
- ఐఈసీసీ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో మోదీ
న్యూఢిల్లీ: తన మూడో టర్మ్‌లో భారతదేశాన్ని ప్రపంచంలోనే టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో చేరుస్తానని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. పునరుద్ధరించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) కాంప్లెక్స్‌ను ప్రధాని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి ప్రయాణం ఆగేది కాదని అన్నారు.
‘ట్రాక్ రికార్డును బట్టి పరిశీలిస్తే.. ఇండియా నా మోడో టర్మ్‌లో ప్రపంచంలోని మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబోతున్నది. ఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ’ అని ఆయన చెప్పుకొన్నారు. పునరుద్ధరించిన ఐఈసీసీకి ‘భారత్ మండపమ్’ అని నామకరణం చేశారు. గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదలు దారిద్య్రం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదికలను ప్రస్తావిస్తూ మోదీ చెప్పారు.
అత్యంత దారిద్య్రం అనేది భారత్‌లో సమసిపోతున్నదని పలు అంతర్జాతీయ సంస్థలు కూడా పేర్కొన్నాయని తెలిపారు. గత 9 ఏళ్లలో అమలు చేసిన నిర్ణయాలు దేశాన్ని సరైన దిశలో నడిపిస్తున్నాయని దీనిని బట్టి అర్థమవుతున్నదని మోదీ పేర్కొన్నారు. మంచి ప్రాజెక్టులను అడ్డుకోవడం కొందరికి అలవాటుగా మారిందని విమర్శించారు.
కర్త్యవ్యపథ్ నిర్మించినప్పుడు అనేక అంశాలు పత్రికల్లో బ్రేకింగ్ న్యూస్‌లుగా వచ్చాయని ఆయన అన్నారు. కోర్టులకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, కానీ, నిర్మాణం పూర్తయిన తర్వాత అదే ప్రజలు బాగుందని కితాబిచ్చారని చెప్పారు. ఇప్పుడు భారత్ మండపం కూడా అదే విధంగా ఆమోదం పొందుతుందని అన్నారు. దీనిని విమర్శించినవారే ఇందులో నిర్వహించే సెమినార్లలో ఉపన్యాసాలు ఇవ్వడానికి వస్తారని చెప్పారు.
కాంప్లెక్‌కు మార్చిన పేరును మోదీ డ్రోన్ ద్వారా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్, ఇతర మంత్రులు ఉన్నారు. భారత్ మండపంలో సెప్టెంబర్‌లో జీ 20 సదస్సు ఇండియా అధ్యక్షతన జరుగనున్నది.