Tharman | సింగపూర్ అధ్యక్షుడిగా ధర్మన్

Tharman | విధాత: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో ధర్మన్ షణ్ముగరత్నం 70 శాతానికి పైగా ఓట్లు సాధించారు. శుక్రవారం ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించగా, సింగపూర్ వాసులు 12 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలో పోటీకి దిగారు. ఫలితంగా ధర్మన్ షణ్ముగరత్నం దేశానికి తొమ్మిదవ దేశాధినేత అయ్యారు. ఈ మాజీ సీనియర్ మంత్రి 70.4 శాతం ఓట్లతో నిర్ణయాత్మక తేడాతో గెలుపొందారు. ఆయన తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. జీఐసీ మాజీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ […]

  • By: Somu    latest    Sep 02, 2023 10:25 AM IST
Tharman | సింగపూర్ అధ్యక్షుడిగా ధర్మన్

Tharman | విధాత: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో ధర్మన్ షణ్ముగరత్నం 70 శాతానికి పైగా ఓట్లు సాధించారు. శుక్రవారం ఆ దేశ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించగా, సింగపూర్ వాసులు 12 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఈ ఎన్నికలో పోటీకి దిగారు. ఫలితంగా ధర్మన్ షణ్ముగరత్నం దేశానికి తొమ్మిదవ దేశాధినేత అయ్యారు.

ఈ మాజీ సీనియర్ మంత్రి 70.4 శాతం ఓట్లతో నిర్ణయాత్మక తేడాతో గెలుపొందారు. ఆయన తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికకానున్నారు. జీఐసీ మాజీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఎన్‌జీ కోక్ సాంగ్ 15.72 శాతంతో రెండో స్థానంలో నిలవగా, ఎన్‌టీయూసీ మాజీ ఇన్‌కమ్ చీఫ్ టాన్ కిన్ లియాన్ 13.88 శాతం ఓట్లను పొందారు. పోటీ చేసిన ఎన్నికల్లో గెలుపొందిన మొదటి చైనాయేతర అధ్యక్ష అభ్యర్థిగా ధర్మన్ రికార్డులకెక్కారు.