సికింద్రాబాద్‌కు మరో వందే భారత్ రైలు..! త్వరలోనే పట్టాలెక్కునున్న సెమీ హైస్పీడ్ ట్రైన్..!
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి

విధాత: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పరుగులు తీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో రెండు హైదరాబాద్‌కు రైల్వేశాఖ కేటాయించింది. సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్, కాచిగూడ – యశ్వంత్‌పూర్ – కాచిగూడ మధ్య రైలు పరుగులు తీస్తున్నాయి.
తాజాగా మరో మార్గంలోనూ వందే భారత్ రైలును పట్టాలెక్కించేందుకు భారతీయ రైల్వే కసరత్తులు చేస్తున్నది. సికింద్రాబాద్ – పుణే మధ్య సెమీ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో మరికొన్ని రూట్లలో రైళ్లను తీసుకువచ్చేందుకు భారతీయ రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం సికింద్రాబాద్ – పుణే మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది.
ఈ రైలు స్థానంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకురావాలని యోచిస్తున్నది. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ పది వందై భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇందులో సికింద్రాబాద్ – పుణే రైలు సైతం ఉండనున్నట్లు తెలుస్తున్నది. అందుబాటులోకి వచ్చే సెమీ హైస్పీడ్ రైలా..? లేదంటే వందే సాధారణ్ రైలా ? అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైనా? అనేది తెలియరాలేదు. త్వరలోనే దీనిపై అధికారికంగా సమాచారం వచ్చే అవకాశాలున్నాయి