Brij Bhushan | రెజ్లర్లపై లైంగిక వేధింపులు నిజమే.. బ్రిజ్‌పై ఢిల్లీ పోలీసుల చార్జిషీట్
Brij Bhushan డబ్ల్యూఎఫ్ఐ చైర్మన్ బ్రిజ్‌పై ఢిల్లీ పోలీసుల చార్జిషీట్ దోషిగా తేలితే 3-5 ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశం 108 మంది సాక్షులతో మాట్లాడిన పోలీసులు విధాత: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మెడకు ఉచ్చు బిగుస్తున్నది. అతడిపై రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల అభియోగాలు నిజమేనని పోలీసుల విచారణతో తేలినట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఆరుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు […]

Brij Bhushan
- డబ్ల్యూఎఫ్ఐ చైర్మన్ బ్రిజ్‌పై ఢిల్లీ పోలీసుల చార్జిషీట్
- దోషిగా తేలితే 3-5 ఏండ్ల జైలు శిక్ష పడే అవకాశం
- 108 మంది సాక్షులతో మాట్లాడిన పోలీసులు
విధాత: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మెడకు ఉచ్చు బిగుస్తున్నది. అతడిపై రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల అభియోగాలు నిజమేనని పోలీసుల విచారణతో తేలినట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఆరుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడటం, వెంబడించడం వంటి నేరారోపణపై బ్రిజ్ విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని ఢిల్లీ పోలీసుల చార్జిషీట్ ద్వారా వెల్లడవుతున్నది.
విచారణలో బ్రిజ్ భూషణ్ దోషిగా తేలితే 3 నుంచి 5 సంత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆరుగురు మహిళా రెజ్లర్లు నమోదు చేసిన ఫిర్యాదుల ప్రకారం..బ్రిజ్ విచారణను ఎదుర్కోవడంతోపాటు శిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుందని ఢిల్లీ పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్న ఆధారాలను బట్టి తెలుస్తున్నది.
బ్రిజ్‌తోపాటు సాక్షులకు సమన్లు ఇవ్వండి
ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషన్‌పై ఐపీసీ సెక్షన్లు 506 (నేరపూరిత బెదిరింపు), 354 (మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం), 354 A (లైంగిక వేధింపులు), 354 డీ (వెంటపడటం), ఒక సందర్భంలో రెజ్లర్లపై సింగ్ వేధింపులు పునరావృతం అయినట్టు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. సింగ్‌తోపాటు సాక్షులకు సమన్లు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోర్టును అభ్యర్థించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొన్నది.
చార్జిషీట్ ప్రకారం.. పోలీసులు 108 మంది సాక్షులతో మాట్లాడారు. వీరిలో రెజ్లర్లు, కోచ్‌లు, రిఫరీలు సహా 15 మంది రెజ్లర్లు చేసిన ఆరోపణలను ధ్రువీకరించారు. మొత్తం ఆరు కేసుల్లో రెండింటిలో, సింగ్‌పై సెక్షన్లు 354, 354A, 354 డీ కింద కేసు నమోదు చేశారు. నాలుగు కేసులు సెక్షన్లు 354, 354A కింద ఉన్నాయి. ఇవి రుజువైతే బ్రిజ్‌కు మూడేండ్ల నుంచి ఐదేండ్ల వరకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.