తామేంటో నిరూపించారు.. భవిష్యత్తుపై ఆశలు కలిగించారు..! మొట్ట మొదటి ట్రాన్స్​‍జండర్‌ వైద్యులతో ప్రత్యేక ఇంటర్య్వూ

మేమూ మనుషులమే.. మాకూ మనసు ఉంది, ఆదరణ కావాలి అందరిలాగే.. మాకూ జీవిత భాగస్వామి కావాలని ఉంటుంది. ‘రూత్‌ జాన్‌ పాల్‌, ప్రాచీ’లు ఎందరికో స్ఫూర్తి ఈ కనిపిస్తున్న ఇద్దరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో తొలి ట్రాన్స్​‍జండర్‌ వైద్యులుగా నియామకమై చరిత్ర సృష్టించారు. ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీకి స్ఫూర్తిగా నిలిచారు. సమాజంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ తమ ఉనికి కోసం, హక్కుల కోసం పోరాతున్న ట్రాన్స్​‍జండర్‌ కమ్యూనిటీకి భవిష్యత్తులో మంచి రోజులున్నాయనే ఆశను వీళ్లు కలిగించారు. ఎందరో ట్రాన్స్​‍జండర్ల […]

  • By: krs    latest    Dec 08, 2022 12:52 PM IST
తామేంటో నిరూపించారు.. భవిష్యత్తుపై ఆశలు కలిగించారు..! మొట్ట మొదటి ట్రాన్స్​‍జండర్‌ వైద్యులతో ప్రత్యేక ఇంటర్య్వూ
  • మేమూ మనుషులమే.. మాకూ మనసు ఉంది, ఆదరణ కావాలి
  • అందరిలాగే.. మాకూ జీవిత భాగస్వామి కావాలని ఉంటుంది.
  • ‘రూత్‌ జాన్‌ పాల్‌, ప్రాచీ’లు ఎందరికో స్ఫూర్తి

ఈ కనిపిస్తున్న ఇద్దరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో తొలి ట్రాన్స్​‍జండర్‌ వైద్యులుగా నియామకమై చరిత్ర సృష్టించారు. ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీకి స్ఫూర్తిగా నిలిచారు. సమాజంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ తమ ఉనికి కోసం, హక్కుల కోసం పోరాతున్న ట్రాన్స్​‍జండర్‌ కమ్యూనిటీకి భవిష్యత్తులో మంచి రోజులున్నాయనే ఆశను వీళ్లు కలిగించారు. ఎందరో ట్రాన్స్​‍జండర్ల లాగే వీళ్లిద్దరు కూడా సంఘంలో అన్ని వైపుల నుంచీ ఎన్నో అవమానాలు, వెక్కిరింతలు, వివక్షలను ఎదుర్కొంటూనే ఆత్మ విశ్వాసంతో తామేంటో నిరూపించారు డాక్టర్లు రూత్‌ జాన్‌ పాల్‌, డాక్టర్‌ ప్రాచీ రాథోడ్‌లు. వారి మనోభావాలు వారి మాటల్లోనే… – (నాగ సుందరి, సీనియర్‌ జర్నలిస్టు)

అందుకే డాక్టర్‌ చదివా..

‘మాది ఖమ్మం. 12వ తరతి వరకూ అక్కడే చదువుకున్నా. చిన్నప్పుడే నాన్న చని పోయారు. మధ్యతరతి కుటుంబం కావడం, నాన్న లేకపోవడం వల్ల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఏడేండ్ల వయసులో నాలో ఏదో తేడా ఉందనే విషయాన్ని గ్రహించిన. కానీ అదేంటో తెలియని వయసు నాది. మానసికంగా తీవ్ర గందరగోళానికి గురయ్యే వాన్ని. మగ పిల్లాడిగా పెరిగినా నేను ఎప్పుడూ అబ్బాయిలతో ఆడుకోవడం గానీ, వారితో కలిసి ఉండటం గానీ చేసేవాన్ని కాదు.

ఎప్పుడూ అమ్మాయిలతోనే ఆడుకునే వాన్ని. వాళ్లతో గడపడం ఇష్టంగా ఉండేది. వాళ్లల్లా డ్రస్సులు వేసుకోవాలని, అలంకరించుకోవాలని ఎప్పుడూ అనిపించేది. నేను ఎప్పుడూ అమ్మాయిలతో ఆడటం, వారితో బాటే ఉండటం చూసి నన్ను అబ్బాయిలు బాగా ఏడిపించేవారు. ‘ఏంటి ఎప్పుడూ అమ్మాయిలతోనే ఉంటావు‘ అని హేళనగా మాట్లాడేవారు.

మనసులో ఆడపిల్లలా ఉండాలనిపించేది. వారిలా తయారవాలని అనిపించేది. ఆడపిల్లలకు మల్లే చిన్నతనం నుంచీ మా అమ్మకు ఇంటి పనుల్లో సాయం చేస్తుండే వాన్ని. అందుకే అమ్మకు నేనంటే బాగా ఇష్టం. కానీ ఆమెకు నా శారీరక, మానసిక స్థితి తెలియదు కదా. నాలోని ఈ పరిస్థితి నన్ను తీవ్ర భయాందోళనకు, కలతకు గురి చేసేది. అయినా ఎప్పుడూ చదువులో ముందుండే వాన్ని.

స్కూల్‌లో, కాలేజీలో ఎప్పుడూ ఫస్ట్‌ వచ్చేవాన్ని. నా కెరీర్‌ పరంగా అన్నయ్య, అమ్మ ఎంతో సపోర్టు ఇచ్చారు. అన్నయ్యకు డాక్టరు అవాలని ఉండేది. కానీ మా కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు. నాకు మాత్రం డాక్టర్‌ కావాలని బాగా ఉండేది. నాలో ఈ ఆలోచనకు బీజం పడటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి అన్నయ్య మా ఆర్థిక పరిస్థితులతో డాక్టర్‌ కోర్సు చదవలేక పోవడం. అందుకే నేనైనా డాక్టర్ చదవాలనుకున్నా.

నన్ను డాక్టర్‌ కావాలని ప్రేరేపించిన మరో సంఘటన ఏమిటంటే.. నేను 8వ తరతి చదివేటప్పుడు మా ఇంటికి దగ్గరలోనే నలుగురైదుగురు ట్రాన్స్​‍జండర్లు ఒక రూములో ఉండేవారు. వారిలో ఒకరికి ఆరోగ్య సమస్య తలెత్తి చనిపోయింది. అప్పుడు ఆ ట్రాన్స్​‍జండర్లు నాతో చెప్పిన మాటలు నాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చనిపోయిన వ్యక్తి ట్రాన్స్​‍జండర్‌ కావడం వల్ల ఆస్పత్రిలో చేర్చుకోలేదు. వైద్యసేవలు అందివ్వలేదు. చివరకు ఆ ట్రాన్స్​‍జండర్‌ చనిపోయినా ఎవ్వరూ పట్టించుకోలేదు.

దివ్యాంగులను అక్కున చేర్చుకునే కుటుంబాలు తమ బిడ్డ ట్రాన్స్​‍జండర్‌ అని తెలిస్తే మాత్రం వారి ముఖం కూడా చూడరు. సమాజంలో వీరి పట్ల ఉన్న వివక్ష, అసమానతలు, ఆడవాళ్లలా ఉండే వారి ప్రవర్తన.. ఇవన్నీ ట్రాన్స్​‍జండర్ల జీవితాలను కష్టాల కుంపటి చేస్తున్నాయి.

తమ బిడ్డలు ట్రాన్స్​‍జండర్లని తెలిసినవెంటనే సొంత కుటుంబసభ్యులే వారిని దూరం పెడుతున్నారు. శారీరకమైన మార్పులు, తేడాల వల్ల వాళ్లు అలా ఉంటారన్న అవగాహన చాలా మందిలో లేకపోవడం ఇందుకు మరో కారణం. ఈ కారణాలతో ట్రాన్స్​‍జండర్లని తెలియగానే తమ బిడ్డలను కుటుంబ సభ్యులు వదిలేస్తున్నారు. వారిని తమ పిల్లలుగా చెప్పుకోవడానికి అవమానంగా భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోంచే.. నేను గట్టిగా అనుకున్నా. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా చదువును మధ్యలో ఆపకూడదని. ఎలాగైనా డాక్టర్‌ చదివి సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్న ట్రాన్స్​‍జండర్‌ కమ్యూనిటీకి అండగా నిలవాలని. ముఖ్యంగా వారికి వైద్యసేవలు అందించాలని, వారికి సమాజంలో అందరిలాగే సమానహక్కులు ఉండేలా కృషి చేయాలని తలంచాను. అందుకే ట్రాన్స్​‍జండర్‌గా నా సెక్సువల్‌ ఐడెంటిటీని బయట పెట్టకుండా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతూనే ఎంతో పట్టుదలతో ఎంబీబీఎస్ చదివిన.

ముఖ్యంగా టీనేజ్‌లో ట్రాన్సజండర్లకు కూడా ఒక తోడు కావాలనిపిస్తుంది. ఆడపిల్లగా ఉండాలని, వారిలా బట్టలు ధరించాలని, నగలు, వూలు అలంకరించుకోవాలని ఉంటుంది. అలాగే ఒక జీవిత భాగస్వామి (లైఫ్‌ పార్ట్‌నర్‌) కావాలని ఆలోచనలు వస్తుంటాయి. కానీ వారు కోరుకున్నట్టు బహిరంగంగా అలా ఉండలేరు. ఇంట్లోవాళ్లు,స్నేహితులు,, సొసైటీ తమను ఎలా చూస్తుందోనని భయపడతారు. చివరకు వారి లోపలి కోరికలు వారిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. ఇంటా బయట వివక్షకు లోనవడంతో ఎవ్వరితో కలవలేక మాలాంటి తోటి ట్రాన్స్​‍జండర్లతోనే జీవిస్తాం. వారితోనే మా సంతోషం, బాధలు, జీవితం అన్నీ.

చాలా మంది అవసరమైన చదువు లేకపోవటం వల్ల నిత్యజీవితం గడవడానికి ట్రాన్స్​‍జండర్లు భిక్షాటన చేస్తున్నారు. సెక్స్​​‍ వర్కర్లుగా పనిచేస్తున్నారు. సెక్సువర్కర్లుగా ట్రాన్స్​‍జండర్లు పడే బాధలు, హింస మాటల్లో చెప్పలేనిది. అనాథలుగానే వారి జీవితాలు ముుస్తాయి. పురుషులు ట్రాన్స్‌జండర్ల ఈ బలహీనతను ఉపయోగించుకుని రెంమూడేళ్లు వారితో కలిసి ఉండి, వారినీ, వారి డబ్బును వాడుకుంటారు. ఆ తర్వాత కుటుంబం చూసిన పిల్లను పెళ్లిచేసుకుని వెళ్లిపోతుంటారు. మోసం చేస్తారు.

ట్రాన్స్​‍జండర్‌ని పెళ్లి చేసుకుంటే సమాజం హేళన చేస్తుందంటారు. ఇవన్నీ తెలిసిన నేను నా జీవితం అలా కాకూడదనుకున్నాను. నా పరిస్థితిని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఎంతో పట్టుదలగా, కెరీర్‌ పైనే నా మనసు నిలుపుకుని, డాక్టర్‌ అయ్యా.. నా కాళ్ల మీద నేను నిలబడ్డా. ఎంబీబీఎస్ చదివేటప్పుడు ధైర్యం చేసి అమ్మకు ఒకరోజు నా శారీరక, మానసిక స్థితి గురించి చెప్పిన. అది విన్న వెంటనే ఆమె నన్ను డాక్టర్ల దగ్గరకు వెళ్లి తగిన వైద్యచికిత్స తీసుకోమంది. డాక్టర్లు అమ్మాయిలా నువ్వు ఫీలవుతున్నావు కాబట్టి ఎలా నువ్వు ఉండాలనుకున్నావో అలాగే ఉండు అని చెప్పారు.

నా పరిస్థితి చూసి అమ్మ ఒక స్థితిలో తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. అన్నయ్య అయితే రెండేండ్లు నాతో మాట్లాడలేదు. ఇపుడు వాళ్లు నన్ను అర్థం చేసుకున్నారు. ఎంబీబీఎస్ అయిన తర్వాత ఉద్యోగం కోసం దాదాపు 15 నుంచి 20 ఆస్పత్రులకు తిరిగిన. ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. హైదరాబాద్‌లోనే ట్రాన్స్​‍జండర్ల కోసం పనిచేస్తున్న ‘మిత్ర’ అనే ఒక ఎన్జీవోలో నన్ను ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇచ్చారు.

తర్వాత హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు పెట్టుకున్నా. ‘మిత్ర’లో నేను చేసిన వైద్యసేవల అనుభవం నాకు మంచి వైద్యురాలిగా పేరు తెచ్చిపెట్టింది. ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే అవకాశం వచ్చింది. ఇక్కడి సిబ్బంది, వైద్యులు అందరూ మమ్మల్ని ఎంతో గౌరవంగా చూస్తారు. పేషంట్లు సైతం ఒక డాక్టర్‌గానే నన్ను చూస్తారు.

ఆస్పత్రిలో నేను వైద్యురాలినే.. కానీ బయటకు వస్తే ఒక ట్రాన్స్​‍జండర్‌ ఎదుర్కొనే అవమానాలన్నీ నేను ఎదుర్కొంటుంటాను. మేం ఎంత చదువకున్నా ఒంటరిగా ఏమీ చేయలేం. మా పట్ల సమాజానికి, కుటుంబాలకు గౌరవం ఉండదు. అందుకే నేను అనేది ఒక్కటే.. పాఠశాల నుంచే పిల్లలకు జండర్‌ ఎ్యకేషన్‌, ఎల్‌జిబిటిక్యూల గురించి అవగాహన పెంచాలి. అప్పుడు తల్లిదంల్రు సైతం ఈ విషయాన్ని అవమానంగా, ఒక సమస్యగా చూడకుండా సర్వసాధారణమైన విషయంగా పరిగణిస్తారు.

నేను చదువుకునేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. ఆ టైములో మా కమ్యూనిటీ నాకిచ్చిన ఆసరా నేను మరువలేను. సమాజంలో స్త్రీపురుషుల రిలేషన్‌కి ఎలాంటి లీగాలిటీ ఉందో అదే ట్రాన్స్​‍జండర్లకు కూడా ఉండాలి. అందరితో పాటు మేం కూడా సమానంగా, సమాన హక్కులతో జీవించలిగిన నాడే ఏదైనా మేం సాధించలమని, అన్ని రంగాలలో ఎంత ఎత్తుకైనా వెళ్లగలమని నిరూపిస్తాం’.

– డాక్టర్‌ రూత్‌ జాన్‌ పాల్‌

నాన్న వల్లే ఈ రోజు ఇలా..

‘నేను ట్రాన్స్​‍జండర్‌ అని తెలిసిన వెంటనే నా కుటుంబం నన్ను వదిలేసింది. ఇప్పటికీ మా కుటుంబ సభ్యులెవరూ నాతో టచ్‌లో లేరు. ఫోన్‌ కూడా చేయరు. ఎవ్వరి అండా నాకు లేదు. మాది ఒక మధ్యతరతి కుటుంబం. ఆదిలాబాద్‌ మా ఊరు. మా నాన్నకు నేను డాక్టర్‌ చదవాలని ఉండేది. ఆయన కోరిక నెర వేర్చాలనుకున్నాను. బాగా చదివేవాన్ని. ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంకు వచ్చి ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడిసిన్‌ చేశాను. ఐదవ తరతి చదువుతన్నప్పుడు నాకు అందరు అబ్బాయిల్లా నేను లేనని అనిపించింది. అబ్బాయిలతో అస్సలు కలిసేవాన్నే కాదు. అమ్మాయిలతో ఉన్నప్పుడు ఎంతో కంఫర్టబుల్‌గా ఫీలయ్యేవాన్ని.

కానీ నాలోని ఈ మార్పు నన్ను చిన్నతనం నుంచీ తీవ్ర వివక్షకు, మానసిక హింసకు గురి చేసింది. ఇంటర్‌ నుంచి ఈ హింస మరీ ఎక్కువైంది. ఆడపిల్లగా ఉండే నా బిహేవియర్‌ చూసి అందరూ నన్ను గేలి చేయడం, అవమానించడం చేసే వారు. నా బాడీ లాంగ్వేజ్‌ను చూసి నవ్వే వారు. నీచంగా కామెంట్లు చేసే వారు. ఆ హింస మనసును తీవ్ర బాధతో మెలిపెట్టేది. ఒక దశలో తోటి వాళ్ల వేధింపులకు తట్టుకోలేక చచ్చిపోవాలనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

కానీ బలహీన పడకూడదునుకున్నా. ఆత్మవిశ్వాసంతో బతకాలనుకున్నా. అప్పుడే నేను నా శారీరక, మానసిక స్థితిని ఎవ్వరి దగ్గర దాచకూడదని నిశ్చయించుకున్నా. ఎంబీబీఎస్ చేసేటప్పుడు అందరికీ నేను ట్రాన్స్​‍జండర్‌నని బహిరంంగా చెప్పడం మొదలెట్టాను. దీంతో కొందరు దూరమయ్యారు. కొందరు ఎప్పటిలాగే మాట్లాడేవారు. మరికొందరు హేళన చేయడం, వెక్కిరించడం చేసేవారు. సమాజం నన్ను హేళన చేసినా నా ఆత్మగౌరవాన్ని పోగొట్టు కోకూడదనుకున్నా. నన్ను నేను సెల్ఫ్‌ మోటివేషన్‌ చేసుకునే వాన్ని. ఎందుకంటే మా బాధ ఎవ్వరికీ చెప్పుకోలేం. మ బాధలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు కూడా. కుటుంబం నుంచి మొదలు పెడితే సమాజంలో మమ్మల్ని ఎవ్వరూ తమతో కలుపుకోరు.

అందరు ట్రాన్స్​‍జండర్లకు మల్లేనే నేను కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. పోరాడాను.. బాధలు పడ్డాను. హింసలపాలయ్యాను. ఈ ప్రయాణం నరకంలా ఉంటుంది. డాక్టర్‌ అవాలన్న నాన్న కోరికే నన్ను ఈ రోజు ఇలా నిలబెట్టిందనుకుంటా ఎప్పుడూ. ఎందుకంటే ఆ డాక్టర్‌ వృత్తే నాకు ఇప్పుడు ఎంతో గౌరవం ఇచ్చింది. ఒక గుర్తింపు తెచ్చింది. ఎంబీబీఎస్ చేసినా ఉద్యోగం రావడం ఎంతో కష్టమైంది. ఒకచోట నేను ట్రాన్స్​‍జండర్‌ అని తెలిశాక ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోండి అని చెప్పిన హాస్పిటల్‌ వారున్నారు.

ఆ తర్వాత ట్రాన్స్​‍జండర్లకు ఉద్దేశించిన ‘మిత్ర’ అనే క్లినిక్‌లో రెండేండ్లు పనిచేశా. అక్కడ పనిచేయడం వల్ల వచ్చిన గుర్తింపు వల్లే తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ఆస్పత్రిలో మెడికల్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇక్కడకు వచ్చే పేషంట్లు మమ్మల్ని ఎంతో బాగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. నా విన్నపం ఏమిటంటే.. ఉద్యోగం, విద్య, ఆర్యోగ్యం ఇలా అన్నింటిలో ట్రాన్స్​‍జండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నప్పుడే వారి జీవితాలు మెరుగు పడతాయి. అప్పుడే ఎందరో ట్రాన్స్‌ జెండర్లు విజేతలుగా బయటకు వస్తారు. స్త్రీ పురుషులు ఎలా జీవిస్తున్నారో అలాగే వారు కూడా సాధారణ జీవితం జీవించ గలుగుతారు. సమాన హక్కులు అనుభవించ గలుగుతారు.

ఇప్పుడు మాకు ఆరోగ్య భద్రత లేదు. గృహ వసతి లేదు. ఇళ్ల లోన్లు లేవు. ఇన్స్యూరెన్స్‌​‍ పాలసీలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలున్నాయి. అందుకే మేం కోరుకునేదొక్కటే. మమ్మల్ని మనుషుల్లా చూడండి. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను, హక్కులను మాకు అందరితో సమానంగా కల్పించండి. ఒక ట్రాన్స్​‍జండర్‌ గానే కాకుండా మనిషిగా నా కమ్యూనిటీ కోసం ఎప్పుడూ నేను ముందుంటాను. వారి సంక్షేమం కోసం నిలబడతాను. -డాక్టర్‌ ప్రాచీ