IPL-2023 | మరికొద్ది గంటల్లో షురూకానున్న పొట్టి క్రికెట్ పండుగ.. ఐపీఎల్-2023 కంప్లీట్ షెడ్యూల్ ఇదే..!
IPL-2023 | విధాత: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ మరికొద్ది గంటల్లో అట్టహాసంగా ప్రారంభం కానున్నది. నేటి నుంచి మే 28 వరకు ధనాదన్ క్రికెట్ అభిమానులను అలరించనున్నది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తలపడనుంది. మహేంద్ర సింగ్ ధోని, హర్దీక్ పాండ్యా జట్ల మధ్య జరిగే పోరుతో 16వ సీజన్ గ్రాండ్‌గా […]
IPL-2023 |
విధాత: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ మరికొద్ది గంటల్లో అట్టహాసంగా ప్రారంభం కానున్నది. నేటి నుంచి మే 28 వరకు ధనాదన్ క్రికెట్ అభిమానులను అలరించనున్నది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో నాలుగు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తలపడనుంది. మహేంద్ర సింగ్ ధోని, హర్దీక్ పాండ్యా జట్ల మధ్య జరిగే పోరుతో 16వ సీజన్ గ్రాండ్‌గా షురూ కానున్నది. గత సీజన్ మాదిరిగానే ఈ సారి సైతం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ ‘ఏ’లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బీలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి.
ప్రతి జట్టు కూడా తమ గ్రూప్‌లోని మిగిలిన జట్లతో రెండేసి సార్లు.. అవతలి గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఈ లెక్కన ప్రతి జట్టు కూడా లీగ్ లో 14 మ్యాచులు ఆడుతుంది. ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు మే 21 వరకు జరుగనున్నాయి. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం ప్లే ఆఫ్స్ మ్యాచులు మొదలవుతాయి. ఇక ఫైనల్ మే 28న జరగనుంది.
ఫైర్ బ్రాండ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram