ఇరాక్‌: త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డ్డ పురాతన ఫ్రిడ్జ్‌.. షాక్‌లో శాస్త్రవేత్త‌లు!

ఆ ఫ్రిడ్జ్‌లో బీర్‌ను దాచిన‌ట్టు ఆధారాలు.. ఆశ్చ‌ర్య‌పోయిన పురావ‌స్తు శాస్త్రవేత్త‌లు విధాత‌: చ‌రిత్ర‌ను వెలికితీసేందుకు పురావ‌స్తు శాస్త్రవేత్త‌లు ఏదోఒక చోట ఎప్పుడూ త‌వ్వ‌కాలు జ‌రుపుతూనే ఉంటారు. ఆ త‌వ్వ‌కాల్లో అప్పుడప్పుడు బ‌య‌ట‌ప‌డే వ‌స్తువులు ఆశ్చ‌ర్యానికి గురిచేసుంటాయి. అలాంటి ఘ‌ట‌నే ద‌క్ష‌ణ ఇరాక్‌లో తాజాగా త‌వ్వ‌కాలు జ‌రిపిన‌ప్పుడు ఎదురైంది. దాదాపు 5000 సంవ‌త్స‌రాల‌ నాటి రెస్టారెంట్ అవ‌శేషాలు బ‌య‌ట‌ ప‌డ‌డంతో పురావ‌స్తు శాస్త్రవేత్త‌లు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. సుమేరియ‌న్ నాగ‌రిక‌త‌కు ముఖ్య‌మైన కేంద్రంగా పిలిచే పురాత‌న ల‌గాష్ శిథిలాల మ‌ధ్య […]

ఇరాక్‌: త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డ్డ పురాతన ఫ్రిడ్జ్‌.. షాక్‌లో శాస్త్రవేత్త‌లు!
  • ఆ ఫ్రిడ్జ్‌లో బీర్‌ను దాచిన‌ట్టు ఆధారాలు..
  • ఆశ్చ‌ర్య‌పోయిన పురావ‌స్తు శాస్త్రవేత్త‌లు

విధాత‌: చ‌రిత్ర‌ను వెలికితీసేందుకు పురావ‌స్తు శాస్త్రవేత్త‌లు ఏదోఒక చోట ఎప్పుడూ త‌వ్వ‌కాలు జ‌రుపుతూనే ఉంటారు. ఆ త‌వ్వ‌కాల్లో అప్పుడప్పుడు బ‌య‌ట‌ప‌డే వ‌స్తువులు ఆశ్చ‌ర్యానికి గురిచేసుంటాయి. అలాంటి ఘ‌ట‌నే ద‌క్ష‌ణ ఇరాక్‌లో తాజాగా త‌వ్వ‌కాలు జ‌రిపిన‌ప్పుడు ఎదురైంది. దాదాపు 5000 సంవ‌త్స‌రాల‌ నాటి రెస్టారెంట్ అవ‌శేషాలు బ‌య‌ట‌ ప‌డ‌డంతో పురావ‌స్తు శాస్త్రవేత్త‌లు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

సుమేరియ‌న్ నాగ‌రిక‌త‌కు ముఖ్య‌మైన కేంద్రంగా పిలిచే పురాత‌న ల‌గాష్ శిథిలాల మ‌ధ్య పురావ‌స్తు శాస్త్రవేత్త‌లు త‌వ్వ‌కాలు ప్రారంభించారు. ఈ క్ర‌మంలో అక్క‌డ 5వేల ఏండ్ల నాటి రెస్టారెంట్‌ను క‌నుగొన్నారు. అందులో ఆ కాలం నాటి ఓవెన్‌, కొన్ని బెంచీలు, గిన్నెలు, త‌దిత‌ర పాత్ర‌లు ల‌భించాయి. అన్నిటికంటే విచిత్రంగా జీర్ అనే మ‌ట్టి రిఫ్రిజిరేట‌ర్ బ‌య‌ట ప‌డ‌డంతో శాస్త్రవేత్త‌లు ఆశ్య‌ర్య‌పోయారు.

మ‌రో విచిత్రం ఏమిటంటే ఆ ఫ్రిడ్జ్‌లో బీర్‌ను దాచిన‌ట్టు ఆధారాలు కూడా దొరికాయి. అంతేకాకుండా ఆ బీర్ త‌యారు చేసే విధానాన్ని కూడా శాస్త్రవేత్త‌లు క‌నుగొన్న‌ట్టు తెలిపారు. పెన్సిల్వేనియా, పిసా విశ్వ‌ విద్యాల‌యాల బృందాలు సంయుక్తంగా త‌వ్వ‌కాలు జ‌ర‌ప‌గా ఈ ఆవిష్క‌ర‌ణ‌లు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ తవ్వ‌కాల బృందం.. డ్రోన్ ఫొటోగ్ర‌ఫీ, థ‌ర్మ‌ల్ ఇమేజింగ్‌, మాగ్నెటోమెట్రీ, మైక్రో స్ట్రాటిగ్రాఫిక్ శాంప్లింగ్ వంటి అధునాత‌న సాంకేత‌క‌త‌ను ఉప‌యోగించి త‌వ్వ‌కాలు జ‌రిపారు.