IRCTC Punya Khetra Yatra | పూరీ-కాశీ క్షేత్ర దర్శనాలకు వెళ్లాలనుకుంటున్నారా..? అద్భుతమైన ప్యాకేజీని తెచ్చిన ఐఆర్‌సీటీసీ.. హైదరాబాద్‌ నుంచే మొదలు..!

IRCTC Punya Khetra Yatra | పరీక్షలు ముగియడంతో పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. వేసవిలో ఏదైనా పర్యాటక ప్రాంతాలు లేదంటే దేవాలయాలను సందర్శించాలని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసం భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ ‘పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో బంపర్‌ టూర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో పూరీ, అయోధ్య, కాశీ క్షేత్రాలను సందర్శించి రావొచ్చు. ఈ ప్యాకేజీ ధర ఎంత? ఎప్పుడు ప్రారంభమవుతుంది ? ఎక్కడి నుంచి మొదలవుతుంది ? ఎన్ని […]

IRCTC Punya Khetra Yatra | పూరీ-కాశీ క్షేత్ర దర్శనాలకు వెళ్లాలనుకుంటున్నారా..? అద్భుతమైన ప్యాకేజీని తెచ్చిన ఐఆర్‌సీటీసీ.. హైదరాబాద్‌ నుంచే మొదలు..!

IRCTC Punya Khetra Yatra | పరీక్షలు ముగియడంతో పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. వేసవిలో ఏదైనా పర్యాటక ప్రాంతాలు లేదంటే దేవాలయాలను సందర్శించాలని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి వారి కోసం భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ ‘పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో బంపర్‌ టూర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో పూరీ, అయోధ్య, కాశీ క్షేత్రాలను సందర్శించి రావొచ్చు. ఈ ప్యాకేజీ ధర ఎంత? ఎప్పుడు ప్రారంభమవుతుంది ? ఎక్కడి నుంచి మొదలవుతుంది ? ఎన్ని రోజులు ఉంటుంది? అనే వివరాలు ఓ సారి తెలుసుకుందాం రండి..!

ప్యాకేజీ వివరాలు..

పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో IRCTC తీసుకువచ్చిన ఈ ప్యాకేజీ మే 13న మొదలు కానున్నది. ఎనిమిది రాతులు, తొమ్మిది రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. కంఫర్ట్, స్టాండర్డ్, ఎకానమీ కేటగిరిలను అందుబాటులో ఉంచగా.. పర్యాటకులు ఎంచుకున్న మేరకు ధరలు అందుబాటులో ఉండనున్నాయి. ఎకానమీ కేటగిరిలో ఒక్కొక్కరు రూ.16,625 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి బుక్‌ చేసుకుంటే ఒక్కొక్కరు రూ.15,120 చెల్లిస్తే సరిపోతుంది.

ఇక 5-11 సంవత్సరాల వారికి రూ.14,511 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. స్టాండర్డ్‌ కేటగిరిలో ఒక్కరికి రూ.25,770, డబుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరు రూ.23,995, పిల్లలకు రూ.23815.. కంఫర్ట్‌ కేటగిరిలో ఒకరికి రూ.34,010, డబుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.31,435, పిల్లలకు రూ.30,015 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.

పర్యాటకులు ఆయా ప్యాకేజీల్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకోవచ్చని తెలిపింది. ఎకానమీలో స్లీపర్‌ క్లాస్‌లో, స్టాండర్డ్ కేటగిరిలో థర్డ్ ఏసీ, కంఫర్ట్ కేటగిరి అంటే సెకండ్ ఏసీలో ప్రయాణం చేయొచ్చు. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్‌, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ అన్నీ ప్యాకేజీలోనే కవర్‌ అవుతాయి.

టూర్‌ కొనసాగేదిలా..

ఐఆర్‌సీటీసీ పుణ్యక్షేత్ర యాత్ర పర్యటన సికింద్రాబాద్‌ నుంచి మొదలవుతుంది. ఈ పర్యటనలో పూరీ జగన్నాథ్‌ ఆలయం, కోణ్కార్‌ సూర్యదేవాలయం-బీచ్‌, గయాలో విష్ణు గయ, కాశీ విశ్వనాథ్ ఆలయం, అన్నపూర్ణాదేవి టెంపుల్‌, సాయంత్రం గంగాహారతి, అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్‌ గర్హి, సరయూ నదిలో హారతి, ప్రయాగ్‌ రాజ్‌లో త్రివేణి సంగమం, హనుమాన్‌ ఆలయం, శంకర్‌ విమన్‌ మండపం తదితర వాటిని సందర్శించవచ్చు. ఇక యాత్ర సికింద్రాబాద్‌లో మే 13న మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయలుదేరుతుంది.

కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట పెందుర్తి, విజయనగరం మీదుగా మరునాడు ఉదయం 9.30 గంటలకు మాల్టీ పాట్పూర్ చేరుతుంది. అక్కడి నుంచి హోటల్‌కు చేరుకొని అనంతరం పూరీ జగన్నాథ్‌ ఆలయానికి వెళ్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మూడో రోజు అల్పాహారం పూర్తి చేసుకొని కోణార్క్‌ సూర్యదేవాలయం, బీచ్‌ను వీక్షించాక రైలు గయా బయలుదేరుతుంది.

నాలుగో రోజు గయాలో పిండప్రదానం, విష్ణుపాదం ఆలయాలను, 5 రోజు కాశీ విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణాదేవి ఆలయం, గంగాహారతి, ఆరో రోజు అయోధ్యలో పర్యటిస్తారు. ఏడో రోజు ప్రయాగ్‌ రాజ్‌లో పర్యటించిన మధ్యాహ్నం తిరిగి ప్రయాణమవుతుంది. తొమ్మిదో రోజు ఉదయం 7.30 గంటలకు రైలు మళ్లీ సికింద్రాబాద్‌ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది. వివరాలకు irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదివచ్చు.