Allu Arjun | అల్లు అర్జున్.. ఈ అవార్డుకు అర్హుడేనా? ఈ ట్రోలింగ్ ఏంటి? ఇంత దారుణమా?

Allu Arjun | National Award | గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో టాలీవుడ్ ప్యూర్ డామినేషన్ కనిపించింది. మరీ ముఖ్యంగా 7 దశాబ్దాల ఈ అవార్డుల చరిత్రలో ఇంత వరకు తెలుగు హీరోకి బెస్ట్ యాక్టర్ అవార్డు రాకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకోవాలి. మొదటి నుంచి ఈ అవార్డుల విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీపై చిన్న చూపే ఉంది. అది ఎందుకనేది పక్కన పెడితే.. ఈసారి మాత్రం […]

  • By: krs    latest    Aug 26, 2023 3:27 AM IST
Allu Arjun | అల్లు అర్జున్.. ఈ అవార్డుకు అర్హుడేనా? ఈ ట్రోలింగ్ ఏంటి? ఇంత దారుణమా?

Allu Arjun | National Award |

గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో టాలీవుడ్ ప్యూర్ డామినేషన్ కనిపించింది. మరీ ముఖ్యంగా 7 దశాబ్దాల ఈ అవార్డుల చరిత్రలో ఇంత వరకు తెలుగు హీరోకి బెస్ట్ యాక్టర్ అవార్డు రాకపోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పుకోవాలి. మొదటి నుంచి ఈ అవార్డుల విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీపై చిన్న చూపే ఉంది. అది ఎందుకనేది పక్కన పెడితే.. ఈసారి మాత్రం టాలీవుడ్ కరువు తీరిపోయేలా దాదాపు 11 అవార్డులు తెలుగు సినిమా ఇండస్ట్రీని వరించాయి.

అందులో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు 6 అవార్డులు, ‘ఉప్పెన’ సినిమాకి, ‘పుష్ప’ సంగీతానికి, చంద్రబోస్ ‘కొండపొలం’ పాటకి, ఇంకోటి ఉత్తమ క్రిటిక్ అని తెలుగు కేటగిరీలో పురుషోత్తమాచార్యులుకి వచ్చాయి. ఇవన్నీ అలా ఉంటే.. బెస్ట్ యాక్టర్ అవార్డు విషయంలో మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ఎందుకంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి.. ఇలాంటి హీరోలెవరి నటనని ఈ అవార్డు కమిటీ ఇప్పటి వరకు గుర్తించలేదు.

అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉత్తమ నటుడే లేడన్నట్లుగా.. ఎప్పుడూ.. బాలీవుడ్, మలయాళం, తమిళ ఇండస్ట్రీలకు తప్పితే.. ఈ విషయంలో టాలీవుడ్ వైపు కన్నెత్తి చూసింది లేదు. అప్పట్లో ‘శంకరాభరణం’, దాసరి ‘మేఘ సందేశం’ వంటి చిత్రాల విషయంలో మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి 4 వరకు జాతీయ అవార్డులు వరించాయి. ఆ తర్వాత ఏదో ఇచ్చాం అన్నట్లుగా 1 లేదంటే 2 ఇస్తూ వస్తున్నారు. కాకపోతే ‘బాహుబలి’ సినిమా తర్వాత మాత్రం పరిస్థితిలో కాస్త ఛేంజ్ వచ్చింది.

‘బాహుబలి’ సినిమా తర్వాత.. అన్ని సినిమా ఇండస్ట్రీస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడు కోవడం మొదలెట్టాయి. ఇంకా చెప్పాలంటే.. ‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసే కోణంలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్వర్ణ యుగమనే చెప్పుకోవాలి. కానీ ‘బాహుబలి’లో నటనకి ప్రభాస్‌కి కూడా దక్కని బెస్ట్ యాక్టర్ అవార్డు.. ఇప్పుడు అల్లు అర్జున్‌కి దక్కడంపై సర్వత్రా ప్రశంసలు వర్షం, అదే స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు అల్లు అర్జున్ ఈ అవార్డుకు అర్హుడేనా? అంటే అర్హుడనే చెప్పాలి. ఎందుకంటే.. ‘పుష్ప’ సినిమా కోసం అల్లు అర్జున్ మేకోవర్ అయిన తీరు, అందులోని అతని నటన, మ్యానరిజమ్స్.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందాయి. అంతర్జాతీయ వేడుకలలో సైతం ‘పుష్ప’ మ్యానరిజమ్స్‌ హల్‌చల్ చేశాయంటే.. ఖచ్చితంగా అల్లు అర్జున్ అర్హుడే. ఇంకా చెప్పాలంటే.. ఈ విషయంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ వార్నర్ బాబాయ్‌కి బన్నీ థ్యాంక్స్ చెప్పుకోవాలి.

ఎందుకంటే.. ‘పుష్ప’ అంతర్జాతీయ స్థాయి గుర్తింపుకు అతను కూడా ఒక కారణం. ఒక రకంగా ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంత పేరు అయితే వచ్చిందో.. ‘పుష్ప’తోనూ అంతే వచ్చింది. కథగా ఇది ఏం స్ఫూర్తి నింపే చిత్రం కాకపోయినా.. ఉత్తమ నటుడు అంటే.. అతని నటన వరకే చూడాలి కాబట్టి.. ఆ లెక్కన చూస్తే అల్లు అర్జున్ తన నటనతో అవార్డ్ విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్‌ని అందులో చూపించాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం ప్రపంచమే ఎదురుచూస్తుందంటే.. అది ఖచ్చితంగా పుష్పరాజ్ క్రియేట్ చేసిన ఇంపాక్టే. కాబట్టి అల్లు అర్జున్‌కి ఈ అర్హత ఉందనే చెప్పుకోవాలి.

అయితే అల్లు అర్జున్ కంటే కూడా.. నామినేషన్స్‌లో వినిపిస్తున్న పేర్ల ప్రకారం ఎక్కువ ఛాన్స్ ఉన్న నటుడు మాత్రం సూర్య అనే చెప్పాలి. ‘జై భీమ్’లో సూర్య నటనకు ఈ అవార్డ్ ఇవ్వవచ్చు. ఆల్రెడీ ‘సూరారై పొట్రు’ చిత్రానికి అతను బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ అందుకుని ఉన్నాడు కాబట్టి.. జ్యూరీ ఈసారి వేరే వారిని సెలక్ట్ చేసిందనుకున్నా.. ఆస్కార్ స్థాయిలో టాలీవుడ్‌కి గుర్తింపు తీసుకువచ్చిన ‘RRR’ హీరోలు రామ్ చరణ్-ఎన్టీఆర్ కూడా లిస్ట్‌లో ఉన్నారు. అందులో వారిద్దరిది సామాన్యమైన నటన కాదు. ఇద్దరూ ప్రాణం పెట్టేశారు. స్టార్ హాలీవుడ్ మేకర్స్ సైతం చరణ్, తారక్‌ల గురించి, వారి నటన గురించి మెచ్చుకున్న సందర్భాలున్నాయి.

బెస్ట్ హీరోయిన్ కేటగిరీలో ఎలా అయితే ఇద్దరు హీరోయిన్లకి అవార్డ్‌ను షేర్ చేశారో.. అలాగే చరణ్, తారక్‌లకి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డ్‌ని ఈసారి షేర్ చేసి ఉండాల్సింది. ‘RRR’ సినిమాతో ఎలా అయితే చరిత్ర సృష్టించారో.. ఈ నేషనల్ అవార్డ్‌తోనూ టాలీవుడ్ పరంగా వారికో చరిత్ర ఉండేది. అల్లు అర్జున్‌కి ఇవ్వాలనుకుంటే.. ‘పుష్ప’ పార్ట్ 2కి కన్సిడర్ చేసి తర్వాత అయినా ఇచ్చుకోవచ్చు కాబట్టి.. ఈ విషయంలో చరణ్, తారక్‌లకు అన్యాయమే జరిగిందని చెప్పుకోవాలి.