ISRO | రోదసీలోకి ఆడ రోబో.. అక్టోబర్‌లో ట్రయల్ మిషన్

ISRO | విధాత, బెంగుళూరు: ఇస్రో చేపట్టనున్న మానవ సహిత స్పేస్ మిషన్ గగనయాన్ కు సన్నాహకంగా త్వరలో ఆడ రోబోను అంతరిక్షంలోకి పంపించేందుకు సన్నాహాలు చేసింది. ఆడ రోబో పేరు వ్యోమ మిత్ర అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్ కారణంగా గగన్ యాన్ ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. అక్టోబర్ లో మొదటి ట్రయల్ మిషన్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. మానవ కార్యకలాపాలన్నింటిని రోబో అనుకరిస్తుందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే […]

  • By: krs    latest    Aug 27, 2023 4:49 PM IST
ISRO | రోదసీలోకి ఆడ రోబో.. అక్టోబర్‌లో ట్రయల్ మిషన్

ISRO |

విధాత, బెంగుళూరు: ఇస్రో చేపట్టనున్న మానవ సహిత స్పేస్ మిషన్ గగనయాన్ కు సన్నాహకంగా త్వరలో ఆడ రోబోను అంతరిక్షంలోకి పంపించేందుకు సన్నాహాలు చేసింది.

ఆడ రోబో పేరు వ్యోమ మిత్ర అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్ కారణంగా గగన్ యాన్ ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు. అక్టోబర్ లో మొదటి ట్రయల్ మిషన్
నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్నారు.

మానవ కార్యకలాపాలన్నింటిని రోబో అనుకరిస్తుందని, అన్నీ అనుకున్నట్లు జరిగితే తదుపరి వ్యోమ గాములను అంతరిక్షంలోకి పంపుతామని జితేంద్ర సింగ్ చెప్పారు.