Site icon vidhaatha

Medak | మెదక్ టీడీపీ అభ్యర్థిగా పుట్టి రాజు?

Medak | విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: త్వరలో జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ బరిలో నిలవనుంది. మెదక్ నియోజకవర్గం నుంచి పుట్టిరాజును అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా, సర్పంచ్ గా పనిచేసిన దివంగత పుట్టి నర్సింహులు చిన్న కుమారుడు పుట్టి రాజు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు.

నియోజక వర్గంలో ముదిరాజుల సంఖ్య ఎక్కువగా ఉండడం, వారి కుటుంబం ముందు నుంచి రాజకీయంగా బలంగా ఉండడంతో ఆయనకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని ప్రచారం జరుగుతోంది.

Exit mobile version