Jabardasth Comedian | యువ‌తిని న‌మ్మించి మోసం.. జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు అరెస్ట్

Jabardasth Comedian | జబర్దస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్ష‌కులని ఎంతగా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. ఈ షో ద్వారా వ‌చ్చిన క‌మెడీషియ‌న్స్ ఇప్పుడు మంచి పొజీష‌న్‌లో ఉన్నారు. కొంద‌రు న‌టులుగా, మ‌రి కొంద‌రు ద‌ర్శ‌కులుగా స‌త్తా చాటుతున్నారు. అయితే జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్, సింగర్ యువ‌తిని ప్రేమించి మోసం చేసి ఆ కేసు విష‌యంలో తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ విష‌యం చర్చనీయాంశంగా మారింది. నవ సందీప్‌కు 2018లో వాట్సాప్ చాటింగ్ ద్వారా […]

  • By: sn    latest    Aug 25, 2023 1:03 AM IST
Jabardasth Comedian | యువ‌తిని న‌మ్మించి మోసం.. జ‌బ‌ర్ధ‌స్త్ న‌టుడు అరెస్ట్

Jabardasth Comedian |

జబర్దస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్ష‌కులని ఎంతగా అల‌రించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. ఈ షో ద్వారా వ‌చ్చిన క‌మెడీషియ‌న్స్ ఇప్పుడు మంచి పొజీష‌న్‌లో ఉన్నారు. కొంద‌రు న‌టులుగా, మ‌రి కొంద‌రు ద‌ర్శ‌కులుగా స‌త్తా చాటుతున్నారు. అయితే జబర్దస్త్ ద్వారా పరిచయమైన కమెడియన్, సింగర్ యువ‌తిని ప్రేమించి మోసం చేసి ఆ కేసు విష‌యంలో తాజాగా అరెస్ట్ అయ్యాడు.

ఇప్పుడు ఈ విష‌యం చర్చనీయాంశంగా మారింది. నవ సందీప్‌కు 2018లో వాట్సాప్ చాటింగ్ ద్వారా ఓ 28 ఏళ్ల యువ‌తి ప‌రిచ‌యం కాగా, ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. దీంతో ఇద్ద‌రు కొద్ది రోజుల పాటు సంతోషంగా తిరిగారు. ఈ విష‌యం ఇంట్లో తెలియ‌డంతో ఆ అమ్మాయిని హైద‌రాబాద్‌కి పిలిపించి షేక్పేట్‌లోని అల్ హమారా కాలనీలో ఉన్న హాస్టల్లో ఉంచాడు.

నాలుగు సంవత్సరాలు పాటు ఆ అమ్మాయి హాస్ట్‌ల్ లో ఉంటుండ‌గా, వీలున్న‌ప్పుడ‌ల్లా ఇద్ద‌రు చెట్టా పట్టాలేసుకుంటూ తిరిగారు. ఈ క్రమంలోనే వారిద్ద‌రు శారీరంకంగా కూడా చాలా దగ్గరయ్యారు. అయితే అప్పుడేమో త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించిన సందీప్ ఇప్పుడు పెళ్లి మాట ఎత్తే స‌రికి మొహం చాటేస్తున్నాడ‌ట‌.

ఆ అమ్మాయి అంటే ఇష్టం లేద‌ని, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్ప‌డంతో ఆ యువ‌తి గోల్కొండ పోలీసులను ఆశ్రయించి అత‌డిపై కేసు పెట్టింది. సందీప్ తనను శారీరకంగా వాడుకొని ఇప్పుడు వ‌దిలేసాడ‌ని త‌న ఆవేద‌న వెళ్ల‌బుచ్చింది.

అయితే యువ‌తి ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు జీరో ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి కేసును మధురానగర్ పోలీసుస్టేషన్‌కు కేసును బ‌దిలి చేశారు. మధురానగర్ పోలీసులు కేసుపై దర్యాప్తు కొనసాగించి తాజాగా అరెస్టు చేశారు. ఆయ‌న‌ని రిమాండ్‌కి త‌ర‌లించారు.

దీంతో ఒక్క‌సారిగా ఆయ‌న అభిమానులు షాక్‌లో ఉన్నారు. కెరీర్‌లో ఎంతో ఎత్తుకు ఎద‌గాల్సిన మీరు లేని పోని వివాదాల‌లో ఇరుక్కొని ఎందుకు ఇలా జీవితం నాశనం చేసుకుంటున్నార‌ని కొంద‌రు తిట్టిపోస్తున్నారు.